
కుబేర సినిమాలో హీరోగా నటించిన ధనుష్ మన తెలుగు హీరో కాదు . కోలీవుడ్ హీరో . కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో ఫామ్ సంపాదించుకొని మార్కెట్ క్రియేట్ చేసుకుని ..తెలుగు డైరెక్టర్ తో సినిమాను ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అంతేనా తెలుగు జనాలు చేతనే వావ్ శభాష్ అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలా స్పెషల్ క్యారెక్టర్ లో మెరవలేక పోతున్నారు అనేది ఇప్పుడు కొంతమంది జనాల వాదన . తెలుగు ఇండస్ట్రీలో పుట్టి తెలుగు ఇండస్ట్రీలో పెరిగి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి స్పెషల్ రోల్స్ చేస్తున్న ఎన్టీఆర్ .. తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పుడు ధనుష్ చేసిన బిచ్చగాడి లాంటి రోల్ ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నారు అంటూ కావాలనే ఆయనని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . అలాంటి వాళ్ళకి నందమూరి ఫ్యాన్స్ కూడా ఘాటుగా ఇచ్చి పడేస్తున్నారు.
క్యారెక్టర్ ఆయన వద్దకు వస్తే ఆయన కచ్చితంగా ఒప్పుకుంటారు అని.. డైరెక్టర్ లు ఎన్టీఆర్ కి అలాంటి పాత్ర రాయలేకపోతున్నారు .. దానికి కారణం వాళ్లకే తెలియాలి.. మధ్యలో ఎన్టీఆర్ ఏం చేస్తాడు..?? అంటూ ఎన్టీఆర్ ను సపోర్ట్ చేస్తున్నారు . కొంతమంది జనాలు మాత్రం నిజమే ఎందుకు ఎన్టీఆర్ - ధనుష్ లా ఆలోచించలేకపోతున్నాడు..? ధనుష్ ల డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలను చూస్ చేసుకోలేకపోతున్నారు ..?? అంటూ మాట్లాడుకుంటున్నారు .
దీంతో ఎన్టీఆర్ కి కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది. అసలే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా పొలిటికల్ పరంగా కూడా ఆయన పేరుని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ కి శత్రువులు ఎక్కువైపోయారు. ఆ కారణంగానే ఆయనకి సంబంధం లేని మ్యాటర్ లో కూడా లాగి మరీ ట్రోల్ చేస్తున్నారు అంటూ కొంతమంది కామన్ పీపుల్స్ కామెంట్స్ చేస్తున్నారు. "కుబేర" సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడం ఏంట్రా అయ్యా ఇదేం చిత్రం అంటూ ఆకతాయిలు ఫన్నీగా కూడా మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!