బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది హీరోయిన్ ఆలియా భట్.. ఈ అమ్మడు హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది.. అయితే వివాహం అనంతరం కొంతమేరకు బొద్దుగా అనిపించిన.. ఆ తర్వాత తనని తాను మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆలియా కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన తర్వాత ఆమె పైన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అసలు ఆలియా పర్ఫెక్ట్ ఫిట్గా కనిపిస్తూ స్టైలిష్ గా నడుస్తూ వస్తూ ఉంటే చూడముచ్చటగా కనిపిస్తోంది.. నిరంతరం డైట్ ప్లానింగ్ జిమ్ వర్కవుట్లతో తెగ కష్టపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆలియా ఆల్ఫా అనే ఒక లేడీస్ పై చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇమే గూడాఛారిగా నటించబోతున్నట్లు సమాచారం.ఇందులో కొన్ని ఫైట్స్, అడ్వెంచర్స్ , యాక్షన్ సన్నివేశాలు  కూడా ఉండబోతున్నాయట. సాధారణంగా తల్లి అయిన తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి.. ఆలియాకు మాత్రం అలాంటి షేడ్స్ అసలు కనిపించలేదు.


ఆలియా ధరించిన ట్రాక్ షూట్ డ్రస్సులో చూసి ఆమె ఇంకా యంగ్ టీనేజ్ ని తలపిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట ఆలియా ని చూసిన తర్వాత అసలు ఈమె ఆలియా నేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయారు నేటిజన్స్. ఆలియా మేకోవర్ అందరికీ ఆదర్శంగా నిలవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఆలియా నటిస్తున్న ఆల్ఫా చిత్రాన్ని YRF బ్యానర్ పైన చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న మొదటి మహిళ చిత్రంగా ఈ సినిమా ఉన్నది. ఇందులో ఎన్నో మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: