
అయితే ఇప్పుడు చైతు గతంలో తన ఫస్ట్ క్రష్ ఎవరనే విషయాన్ని బయట పెట్టిన విషయం తెలిసింది . గతంలో చైతు బాలీవుడ్ లో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో సైతం చైతన్య ఇలాంటి కామెంట్స్ చేశాడు ఇప్పుడు మరోసారి అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అయితే భవిష్యత్తులో హిందీలో మీరు ఎవరితో పని చేయాలని ఉంది అని అక్కడ ప్రశ్నించగా .. దానికి చైతన్య స్పందిస్తూ . తన ఫస్ట్ క్రష్ మాజీ ప్రపంచ సుందరి సుష్మితా సేన్ ని .. ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు కూడా సైతం చెప్పానని ఆయన అన్నారు ..
అలాగే ఆలియా భట్ యాక్టింగ్ అంటే ఇష్టమని .. ఆమెతో సినిమా చేసే అవకాశం వస్తే అసలు వదులుకోనని చెప్పుకొచ్చారు .. అదే విధంగా ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లతో నటించాలని ఉందని కూడా చెప్పుకొచ్చారు ..అలాగే తన ఆటోగ్రాఫీ రాయాల్సి వస్తే దానికి ఏం పేరు పెడతారని అడగగా .. జీవితాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అనే టైటిల్ పెడతానని . ఏదైనా ఒక దీవిలో చిక్కుకపోతే తనకు ఇష్టమైన మ్యూజిక్ ఉండాలి కోరుకుంటానని అలాగే తన మనసుకు నచ్చిన మహిళతో సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోతానని కూడా చెప్పుకొచ్చారు .