`లైగర్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇటీవల తమిళ స్టార్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ `పూరి సేతుపతి` వర్కింగ్ టైటిల్ తో తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపిక అయింది. సీనియర్ బ్యూటీ టబు విలన్‌గా నటిస్తుండగా.. శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్, రాధికా ఆప్టే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


ఛార్మి కౌర్‌ సమర్పణలో పూరి జగన్నాథ్, జేసీ నారాయణరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు `బెగ్గ‌ర్‌` అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. హైదరాబాదులో షూటింగ్ ప్రారంభమైంది. అయితే సాధారణంగా పూరి తన సినిమాలను హీరో మరియు విలన్ పాత్రలతో తొలి షెడ్యూల్ ను ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ను ఆయ‌న బ్రేక్ చేశారు.


తొలి షెడ్యూల్ లో విజయ్ సేతుపతి, సంయుక్త మీన‌న్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ తో తన సినిమాను పూరి ప్రారంభించారు. ఇక ఈ సినిమా షూటింగ్ రెండు మూడు నెలల్లోనే ఫినిష్ చేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జ‌రిగితే వచ్చే ఏడాది ఆరంభంలో పూరి-సేతుపతి సినిమా విడుద‌ల‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న పూరి జ‌గ‌న్నాథ్‌.. ఈ మూవీతో అయిన ఫామ్‌లోకి వ‌స్తారేమో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: