1982 జూలై 9 - తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ గర్వకారణమైన తేదీ. అదే రోజు విడుదలైన నటరత్న ఎన్టీఆర్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘బొబ్బిలి పులి’ సినిమా సౌత్ ఇండియా సినిమా రంగాన్ని బద్దలుకొట్టిన ఘట్టంగా గుర్తించబడింది. ‘బొబ్బిలి పులి’ - 100 థియేటర్లలో సిముల్టేనియస్ రిలీజ్ చేసిన తొలి దక్షిణాది చిత్రం .. ప్రస్తుతం పాన్ ఇండియా రిలీజ్‌లు సాధారణమయినా, 1982లో ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి దక్షిణాది సినిమాగా 'బొబ్బిలి పులి' చరిత్ర సృష్టించింది. అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రధాన కేంద్రాల్లో మాత్రమే విడుదల కావడం విశేషం.


ఫస్ట్ డే కలెక్షన్లే సంచలనం: ₹13.22 లక్షలు : అప్పటి పరిస్థితుల్లో టికెట్ ధరలు నేలక్లాస్ ₹0.41 నుంచి హైక్లాస్ ₹2 మాత్రమే ఉండగా, 'బొబ్బిలి పులి' మొదటి రోజే రూ.13,22,014.91 వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వసూళ్లు అప్పట్లో ఓ మూడురోజుల కలెక్షన్‌కి సమానం! ఫస్ట్ వీక్ కలెక్షన్ – ₹71.6 లక్షలు: అవి రోజుల్లో ఓ రాష్ట్రంలోనే (AP+Karnataka) ఈ స్థాయి వసూళ్లు సాధించడం గమనార్హం. నేటి మార్కెట్‌కి పోల్చితే ఈ వసూళ్లు ₹200 కోట్లకు సమానం అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వెల్లివిరుస్తోంది.



 రాజకీయ ఒత్తిళ్లు - అభిమానుల ఉద్యమం : ఈ చిత్రంలో అప్పటి ప్రభుత్వాలపై విమర్శాత్మక విషయాలు ఉండటంతో సెన్సార్ బోర్డు విడుదలను ఆలస్యం చేయాలని యత్నించింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించగా, చివరికి కట్‌లు వేయించిన తర్వాత రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎన్టీఆర్ స్పీడ్ – 42 రోజుల్లో మరో బ్లాక్‌బస్టర్ : ఇప్పటి స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఆశ్చర్యం కాదు. కానీ ఎన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’ ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండగానే, కేవలం 42 రోజుల గ్యాప్‌తో 'బొబ్బిలి పులి'ను విడుదల చేయడం విన్నపుడే షాక్ కి గురికావాల్సిందే!



రికార్డుల పరంపర: ఎన్టీఆర్ ఓపెనింగ్ కలెక్షన్ల సింగ్‌ల్ డామినేషన్ 1977–1982 మధ్య కాలంలో ఫస్ట్ వీక్ రూ.23 లక్షలకిపైగా వసూలు చేసిన 13 సినిమాలు అన్నీ ఎన్టీఆర్‌వే! ఇతర స్టార్స్ టాప్ ఫస్ట్ వీక్ వసూళ్లు కలిపినా, బొబ్బిలి పులి ఒక్కటే వాటి కంటే 3 రెట్లు ఎక్కువగా వసూలు చేయడం ఓ రికార్డే కాదు – ఓ చరిత్ర!  ‘బొబ్బిలి పులి’ లెగసీ – ఓపెనింగ్ రికార్డుల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే మైల్‌స్టోన్ : ఎన్టీఆర్ సినిమాల హవా, ఆయన మాస్ క్రేజ్, అద్భుతమైన నటన – ఇవన్నీ కలిసిన ఒకే చిత్రమే ‘బొబ్బిలి పులి’. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికలపై పాటలు, డైలాగులు ట్రెండ్ అవుతూ ఉంటే, దాని శాశ్వత గుర్తింపే స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: