ఇంకొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ సినిమాను గూర్చి ప్రేక్షకుల్లో భారీ స్థాయి ఆసక్తి నెలకొంది. ఇది ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నటించిన తొలి స్ట్రయిట్ మూవీ కావడం, మరోవైపు ఆయన నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘దేవర’ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా సినిమా ప్రమోషన్లు మాత్రం మామూలుగా ఉండటం అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. వార్ 2 టీజర్ ఇప్పటికే విడుదలైంది కానీ, అది ఆడియెన్స్‌ నుంచి పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. టీజర్‌ క్వాలిటీపై విమర్శలు, ట్రైలర్ ఎప్పుడొస్తుందన్న అనుమానాలు అభిమానుల్లో పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో మరో మాస్ మల్టీస్టారర్ అయిన నాగార్జున , ర‌జిని ‘కూలీ’ ప్రమోషన్లు మాత్రం ఊపులో ఉన్నాయి – పాటలు, పోస్టర్లు, బీహైండ్ ద సీన్ వీడియోలు వరుసగా విడుదలవుతున్నాయి.


వార్‌ 2 ప్రమోషన్లు స్లోగా ఉండడం వల్ల అదే టైంలో రిలీజ్ కానున్న 'కూలీ' పైనే బజ్ ఎక్కువగా కనిపిస్తోంది. వార్‌ 2 సినిమాకు ఎన్టీఆర్హృతిక్ రోషన్ ముఖ్యమైన స్టార్స్. అయితే ఈ ఇద్దరూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారా ? వారికి ఎంత సమయం ఉంది ? అన్నది స్పష్టంగా తెలియకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలుగు బెల్ట్లో వార్ 2 కి గట్టి హైప్ రావాలంటే ఎన్టీఆర్ క్రేజ్‌ తప్పనిసరి అని అభిమానులు భావిస్తున్నారు. వార్‌ 2 తెలుగు రైట్స్ ను ప్రముఖ నిర్మాత నాగ వంశీ దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్ అయిన ఆయన, తెలుగు బెల్ట్‌లో ప్రమోషన్లను మాస్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. పాటలు, ట్రైలర్, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు ఇలా అన్ని ప్రమోషన్ స్ట్రాటజీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలున్నాయి.

WAR 2 – భారీ యాక్షన్ ఫిల్మ్, స్టైలిష్ ప్రెజెంటేషన్, హృతిక్ – ఎన్టీఆర్ కాంబో

Coolie – మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, లోకేష్ కనగరాజ్ స్టైల్, అమీర్ ఖాన్ – నాగ్ – ఉపేంద్ర కాంబో

వీటిలో Coolie ప్రమోషన్ల పరంగా ముందు ఉంది , కానీ war 2కు స్టార్ పవర్ + యశ్ రాజ్ బ్యానర్ + స్పై యాక్షన్ ఫ్లేవర్ అనేవి ప్లస్ పాయింట్లు.

WAR 2 బలమైన కంటెంట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్లలో జాప్యం కారణంగా బజ్ తక్కువగా ఉంది. ఇప్పుడు అయినా మేకర్స్ మెలకువ పట్టకపోతే, కూలీ బాక్సాఫీస్ పోటిలో గ‌ట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు బెల్ట్ లో ఎన్టీఆర్ హైప్ ను క్యాష్ చేసుకోవాలంటే నిర్మ‌త నాగ‌వంశీ న‌డుం బిగించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: