సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి వారం ఎంతోమంది కొత్త హీరోలు అదృష్టాన్ని పరీక్షించుకున్నా వాళ్లలో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా ఈ వారం గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాధాకృష్ణా రెడ్డి డైరెక్షన్ లో వారాహి చలనచిత్రం బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైంది.

స్టార్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా  జెనీలియా చాలా సంవత్సరాల తర్వాత  రీఎంట్రీ  ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది.  ఇప్పటికే  విడుదలైన ట్రైలర్ కు పాజిటివ్  రెస్పాన్స్ రావడంతో పాటు వైరల్ వయ్యారి  సాంగ్ ఊహించని స్థాయిలో వైరల్ అయింది.  కిరీటి బాక్సాఫీస్  వద్ద  జూనియర్  సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

కథ :

కోదండపాణి (వీ రవిచంద్రన్) దంపతులకు  ఆలస్యంగా  సంతానం కలగగా  అభి (కిరీటి) పుట్టిన వెంటనే  తల్లి చనిపోవడంతో  కోదండపాణి  తన కొడుకుకు ఎలాంటి  ఇబ్బంది రాకుండా పెంచాలని భావించి అలానే పెంచుతాడు.  అయితే తన తండ్రికి, తనకు మధ్య ఏజ్  గ్యాప్,  జనరేషన్ గ్యాప్  ఎక్కువగా ఉండటంతో  తండ్రి ప్రేమను  అభి  ఒకింత భారంగా భావిస్తూ ఉంటాడు.  కొత్తదనాన్ని, ఛాలెంజ్ ను కోరుకునే అభి  సిటీలో కాలేజ్ లో  జాయిన్ అయ్యి ఇంట్లో కోల్పోయిన స్వేఛ్చను  అక్కడ పొందాలని భావిస్తాడు.

కాలేజ్ లో స్ఫూర్తి ( శ్రీలీల) అభిని  తొలి  చూపులోనే ఆకట్టుకోగా  చదువు పూర్తైన  తర్వాత స్ఫూర్తి ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తుందో అభి కూడా అదే కంపెనీలో జాయిన్ అవుతాడు.  ఆ కంపెనీకి   సౌజన్య (జెనీలియా) సీఈవో   అయ్యే సమయంలో అభి వల్ల ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.  అయితే  సౌజన్య  కుటుంబానికి అభి కుటుంబానికి ఉన్న లింక్ ఏంటి?  అభి ఎంట్రీతో  సౌజన్య జీవితంలో  ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

సాధారణంగా కొత్త హీరోలు  తమ తొలి  సినిమా నటన విషయంలో ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంటూ  ఉంటారు.  అయితే కిరీటి రెడ్డి మాత్రం   అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. స్టార్ హీరోల స్థాయిలో   అభినయాన్ని కనబరిచిన  కిరీటి  భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడని  చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని  కచ్చితంగా చెప్పవచ్చు.

సినిమా స్టోరీ లైన్  మరీ కొత్తది కాకపోయినా  కథనం  మాత్రం ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది.   అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండగా ఈ వీకెండ్ కు థియేటర్లలో సినిమా చూడాలని భావించే  వాళ్లకు  ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

శ్రీలీల, జెనీలియా తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.   ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.  ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణారెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు.  యాక్టింగ్, డ్యాన్స్,  ఇతర అంశాల్లో సైతం కిరీటి ప్రతిభను చాటుకున్నారు.  కిరీటి  రూపంలో  సౌత్ ఇండియాకు మరో మంచి హీరో  దొరికాడని చెప్పవచ్చు.  నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.  సినిమాటోగ్రాఫర్ సెంథిల్  రాజమౌళి సినిమాలకు ఎలాంటి ఔట్ ఫుట్ ఇస్తారో ఈ సినిమాకు సైతం అలాంటి ఔట్ ఫుట్ ఇచ్చారు. ఎడిటింగ్  విషయంలో  ఎడిటర్  పనితీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని  చెప్పవచ్చు.

బలాలు : కిరీటి రెడ్డి నటన, సెకండాఫ్,  ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్,  ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్

బలహీనతలు : ఫస్టాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు,   రొటీన్ స్టోరీ లైన్

రేటింగ్ : 3.0/5.0

 

మరింత సమాచారం తెలుసుకోండి: