"హరిహర వీరమల్లు".. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ .  ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద హంగామా స్టార్ట్ చేసేసారు.  మోస్ట్ అవైటెడ్ సినిమా ఈ హరిహర వీరమల్లు . పలు ప్రాంతాలలో పవన్ కటౌట్స్ తో హంగామా చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.  తాజాగా బెంగళూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు క్రియేట్ చేసిన ఒక కటౌట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటించిన కటౌట్స్ ని అన్ని చోట్ల చక్కగా అమర్చారు .


అయితే బెంగళూరులో మాత్రం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" కటౌట్ తో పాటు పక్కన స్పెషల్ అట్రాక్షన్ గా ఆయన కొడుకు అకీరానందన్ కటౌట్ ని కూడా క్రియేట్ చేశారు.  దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . అందరూ జూనియర్ పవర్ స్టార్ అంటూ అకిరా నందన్ ని తెగ పొగిడేస్తున్నారు . అచ్చం నాన్నలాగే ఉన్నాడు నాన్న తర్వాత ఆ స్థానాన్ని ఇండస్ట్రీలో రీప్లేస్ చేయబోయేది కొడుకే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై అకిరానందన్ అన్న నినాదాలతో హోరెత్తించేస్తున్నారు.



సోషల్ మీడియాలో ఇప్పుడు ఇద్దరి కటౌట్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఏమాటకామాటే తండ్రికి తగ్గ రేంజ్ లోనే కొడుకు కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు అంటూ సినీ ప్రముఖులు కూడా పొగిడేస్తున్నారు . త్వరలోనే అఖీరానందన్ సినిమా ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ దీనిపై పవన్ కళ్యాణ్ కానీ అటు రేణు దేశాయ్ కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు . కానీ రీసెంట్ గా హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో మాత్రం పవన పరోక్షకంగా కొడుకు రీ ఎంట్రీని కన్ ఫామ్ చేసేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ కూడా అఖీరా ని ఇండస్ట్రీలోకి దించే ప్రయత్నం జరుగుతుంది అని తెలుస్తుంది.  జులై 24వ తేదీ ఈ  హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది . ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం..!



మరింత సమాచారం తెలుసుకోండి: