- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

విజయ్ దేవరకొండ తాజా సినిమా ‘కింగ్‌డమ్’ ఈ నెల 31 న‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ సినిమాలోని సెటప్, కథా నేపథ్యం, కాన్‌ఫ్లిక్ట్ ఎలిమెంట్ ఇలా అన్నింటి గురించి ఒక స్పష్టతకు వచ్చేశారు. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశించొచ్చో ట్రైలర్ స్పష్టంగా తెలిపింది. ట్రైలర్ కట్ చేయడంలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి కథను పూర్తిగా వెల్లడించి, ప్రేక్షకులను సినిమాకి మానసికంగా ప్రిపేర్ చేయ‌డం .. రెండోది కథను దాచి, థియేటర్‌లో సర్ప్రైజ్ ఇవ్వడం. 'కింగ్‌డమ్' మొదటి విధానాన్ని ఎంచుకుంది. కథేంటో, హీరో పాత్ర ఎలా ఉంటుందో ముందే చూపిస్తూ సినిమాకు ఓ ఫిక్స్‌డ్ టోన్‌ను సెట్ చేసింది. ఇది ఒక రకంగా సేఫ్ ప్లే. అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటే, ఆడియన్స్ మైండ్‌సెట్ క్లియర్‌గా ఉంటుంది.


అదే సమయంలో కథ ముందే తెలిసిన ప్రేక్షకుడు థియేటర్లో దానికి మించి ఎంటర్టైన్‌మెంట్, ఎమోషన్, థ్రిల్ ఆశిస్తాడు. ఆ అంచనాలను మించి వెళ్లకపోతే సినిమా తీసినా... బలమైన క్యాన్వాస్ కూడా ప్రయోజనం ఇవ్వదు.  సినిమా టీమ్ తీసుకున్న కథను నూతనంగా చెప్పగలగాలి. ట్విస్టులు అంచనాలకు అంద‌ని విధంగా ఉండాలి. పాత్రల ఎంపిక, విజువల్స్, ఎమోషనల్ హైపాయింట్స్ కొత్తగా ఉండాలి. ఇది సినిమాకు ప్రధాన సవాలుగా మారింది.
ఇక ప్రీమియ‌ర్ షోలు ముందు వేస్తే కూడా రిస్క్ ఉంది. పాజిటివ్ టాక్ వ‌స్తే సినిమా ఊపందుకుంది. నెగ‌టివ్ టాక్ వ‌స్తే రిలీజ్ డే నాడు మైన‌స్ అవుతుంది.


మరోవైపు వీరమల్లుళు, వార్ 2, కూలీ లాంటి భారీ సినిమాల మధ్య ‘కింగ్‌డమ్’ రిలీజ్ కావడం మరో సవాలే. వరుసగా భారీ సినిమాలు వస్తుండటంతో కింగ్‌డ‌మ్ కంటెంట్‌తో మెప్పించ‌క‌పోతే ఇబ్బందే. ఏదేమైనా విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌కు కింగ్‌డ‌మ్ అగ్నిప‌రీక్ష అన‌డంలో సందేహం లేదు. ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ కొట్టాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: