
పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరికీ తెలుసు. ఓజి కూడా అదే స్థాయిలో మాత్రమే కాకుండా, మరింత ఘనమైన రికార్డులు నమోదు చేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటినుంచే మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వస్తాయో అని ఫ్యాన్స్ లో ఒక వింత ఉత్కంఠ నెలకొంది.ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టైటిల్. చాలా మంది సినీ ప్రముఖుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా టైటిల్‌నే సగం విజయవంతం చేసేసింది. “ఓజి” అనే పదం చిన్నదే అయినా చాలా నాటిగా, ఆకర్షణీయంగా, క్యాచీగా ఉండి ప్రజలలో వెంటనే హిట్ అయ్యింది. ఈ టైటిల్ పెట్టడం ద్వారా డైరెక్టర్ సుజిత్ రిలీజ్ కి ముందే సగం విజయాన్ని అందుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు.
అసలు విషయానికి వస్తే, ఈ సినిమా కోసం మొదటగా అనుకున్న టైటిల్ “గ్యాంగ్‌స్టార్” అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కథ మొత్తం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. మూవీ మేకర్స్ కూడా ఆ టైటిల్‌నే రిజిస్టర్ చేయాలనుకున్నారట. అయితే చివరికి ఆలోచన మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ అంటే ఒక సాధారణ పేరు కాదు, దానికి ఒక ప్రత్యేకత, ఒక స్థాయి ఉండాలని సుజిత్ నిర్ణయించుకున్నాడు. ఆయనకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఏ విధంగా అయినా సరిగ్గా ఉపయోగించుకోవాలని, తన ప్రతిభను నిరూపించుకోవాలని భావించి, కొత్తగా “ఓజి” అనే ప్రత్యేకమైన టైటిల్‌ను క్రియేట్ చేశాడు.
ఈ నిర్ణయం నిజంగానే హిట్ అయ్యింది. గ్యాంగ్‌స్టార్ అని టైటిల్ పెడితే అది సాధారణంగా కనిపించే అవకాశం ఉంది. కానీ “ఓజి” అనే టైటిల్ మాత్రం సినిమాకి మరో లెవెల్ హైప్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరికి, ప్రతి వీధికీ, ప్రతి గల్లీకీ ఈ సినిమా పేరు చేరిపోయింది. ఓజి ఇప్పుడు అభిమానుల రక్తంలో కలిసిపోయినట్టే ఉంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో, థియేటర్స్ వద్ద, ఎక్కడ చూసినా “ఓజి ఓజి” అంటూ నినాదాలు చేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి టైటిల్ ఎంపిక నుంచి, రిలీజ్ హంగామా వరకు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఒక పండుగలా మార్చేశారు.