
కానీ గత కొంతకాలంగా అలాంటి పాత్రలు ఆయనకు రాలేదు. ఎక్కువగా ఫ్యాక్షన్ లేదా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉన్నా, డివోషనల్ టచ్‌తో వచ్చిన అఖండ సినిమాలోని అఘోర పాత్ర మాత్రమే ప్రత్యేకంగా నిలిచింది. కానీ మహారాజు గెటప్‌లో కనిపించే పాత్ర మాత్రం ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ఇక తాజాగా ఈ కోరికను దర్శకుడు గోపీచంద్ మలినేని నిజం చేయబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. నిర్మాత సతీష్ కిలారు నిర్మాణంలో బాలయ్య ఒక భారీ చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో గాసిప్ హాట్‌గా మారింది. ఈ సినిమాను బాలయ్య కెరీర్‌లోనే అత్యంత హైలైట్‌గా నిలిపేలా మేకర్స్ పకడ్బందీ ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో బాలయ్య చారిత్రక గెటప్‌లో కనిపించబోతారని, అందుకు తగ్గట్లుగా సినిమా కోసం రియల్ కోటలలో షూటింగ్ చేయాలని టీమ్ డిసైడ్ చేసిందట. సెట్ వేసి కృత్రిమంగా చేయడం కన్నా రియల్ లొకేషన్‌లో షూట్ చేస్తే సినిమా లుక్స్ అద్భుతంగా వస్తాయని, ఆ ఫీల్ కూడా ప్రేక్షకులకు రియలిస్టిక్‌గా అనిపిస్తుందని డైరెక్టర్ గోపీచంద్ భావిస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత కోటలను వెతికేస్తున్నారని టాక్.ఇటీవల బాలయ్య, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి కోసం కూడా కొన్ని కోట్లలో రియల్ కోటలలో షూట్ చేసిన సంగతి తెలిసిందే.