
ఆమె అందం, ఆమె కట్టు, అభినయ శైలి అందరినీ ఇంప్రెస్ చేశాయి. నిన్న కాక మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రియాంకా క్యారెక్టర్ గురించి చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అలాంటి ప్రియాంకా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా చర్చిస్తున్నారు. ఆమెకు ఏం ఇష్టం? ఎక్కడికి వెళ్లడం ఇష్టపడుతుంది? ఆమె హాబీలు ఏంటి? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె ఇలాంటి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇవి:
*ప్రియాంకా చాలా సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడుతుంది. హంగామాలు చేయడం ఆమెకు నచ్చదు.
*ముఖ్యంగా వెకేషన్స్‌కి ద్వీపాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాలో ఐలాండ్ ఫొటోలు చాలానే ఉన్నాయి.
*భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించదు. ప్రస్తుతం జీవితం ఎలా ఉందో దానిపైనే కాన్సంట్రేట్ చేస్తుంది.
*“ప్రస్తుతం బాగానే ఉంటే చాలు, హంగామాలకు పోనవసరం లేదు” అనుకునే టైప్.
*ప్రియాంకా మంచి ఫుడీ. సాంబార్ ఇడ్లీ అంటే ప్రాణం—రోజూ తినగలదట.
*వంట చేయడం అంటే ఆమెకు మహా ఇష్టం. షూటింగ్ టైంలో ఖాళీ దొరికినా వంట చేస్తుంది. కొన్ని సార్లు ఆ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
*పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఒక నవల చదవడం మొదలుపెడితే పూర్తయ్యే వరకు నిద్రపోదట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, చదివి పూర్తిచేశాకే మిగతా పనులు చేస్తుంది.
*ఆమెకు నేచర్, బీచ్ వ్యూస్, ఫిల్టర్ కాఫీ, సింపుల్ డ్రెస్సింగ్ అంటే బాగా నచ్చుతాయి.
*కాస్ట్యూమ్స్‌కి చాలా తక్కువ డబ్బు ఖర్చు పెడుతుందట.
*చెట్లు పెంచడం, చెట్ల మధ్య ఉండడం ఆమెకు చాలా ఇష్టం. ప్రకృతిలోకి వెళ్తే ఒక క్లిక్ తప్పనిసరిగా కొడుతుందట.
*ఎంత బిజీగా ఉన్నా యోగ చేయడాన్ని మాత్రం ఎప్పుడూ మిస్ చేయదు. తినడం మానేసినా, యోగ మాత్రం మానదు అంటుంది.
* ఓల్డ్ లుక్‌లో, చీరలు ధరించడం కూడా ఆమెకి చాలా ఇష్టమట..!