
రిలీజ్‌కు ముందే ఓజీ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దుమ్ము దులిపేస్తోంది .. ఓజీ సినిమాకు వచ్చిన టాక్ అడ్వాన్స్ బుకింగ్స్ .. ప్రీమియర్ల కలెక్షన్లు ఇవన్నీ చూసుకుంటే ఓజీ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవనుంది. అలాగే టాలీవుడ్ లో సైతం ఈ యేడాది బిగ్గెస్ట్ వసూళ్లు రాబట్టే సినిమాగా ఓజీ రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఓజీ సినిమాకు ఇప్పటి వరకు 366 ప్రీమియర్ షోలతో కలుపుకుని సెప్టెంబర్ 25 అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం 93 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే పూర్తయ్యే సరికి ఇది రు. 150 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ..
కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకు నైజాంలో ప్రీమియర్లు కేటాయించారు. నైజాంలోనే ఏకంగా 366 ప్రీమియర్ షోలు వేశారు. ప్రతి షో హౌస్ ఫుల్ అయ్యింది. అసలు ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో నైజాం లో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ప్రీమియర్ షోలు వేయలేదు. పైగా మిరాయ్ ఆడుతున్న సినిమాను ఆపేసి మరీ ఇక్కడ షోలు వేశారు అంటే ఓజీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు