
పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజునే 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.
'ఓజీ' చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గెటప్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, అలాగే చిత్రంలోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అభిమానులు ఈ చిత్రాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీమియర్స్ నుంచి తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓజీకి లభించిన ఈ అద్భుతమైన స్పందన, వీకెండ్‌లో కూడా కొనసాగితే, ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. ఈ సినిమా కేవలం ఒక పవన్ కళ్యాణ్ సినిమాగా కాకుండా, ఒక బాక్సాఫీస్ సంచలనంగా నిలిచిపోయింది. సుజీత్ టేకింగ్, థమన్ సంగీతం, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించిన కొత్త లుక్.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా విజయం, పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఓజీ ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఓజీ సినిమా సాధిస్తున్న రికార్డులు పవన్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి.