
పెట్టిన రూపాయికి న్యాయం చేశాడు రిషబ్ శెట్టి . అలాగే టెక్నికల్ గా వావ్ అనే లాగానే ఉంది ఈ మూవీ . అటవీ నేపథ్యాన్ని తెరపై చాలా అందంగా మరియు స్పష్టంగా రూపొందించాడు రిషబ్ . అలానే గార్డియన్ ఆఫ్ కాంతారావు పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడని చెప్పుకోవచ్చు . ఈ సినిమాలో రిషబ్ నటనకు చాలా అవార్డులను దలుచుకోవడం ఖాయం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు . ఒక అవతారం నుంచి మరొక అవతారం కు మారినప్పుడు రిషబ్ నటన అద్భుతం అనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది . రిషబ్ శెట్టి టాప్ నాచ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు .
ఇక మరి ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు రిషబ్ శెట్టి జీవించేసాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఒక నటుడిగా దర్శకుడిగా రిషబ్ ఈ సినిమా కోసం పడిన కష్టం మాటల్లో చెప్పేదికాదు . తాను రాసుకున్న ప్రతి పాయింట్ను అంతే డీటెయిల్ గా తెరపై చూపించాడు రిషబ్ శెట్టి . ఈ మూవీ చూసిన ఆడియన్స్ చెప్పే ఒకే ఒక మాట శభాష్ రిశబ్శెట్టి . అలానే హ్యాట్సాఫ్ టు యువర్ డెడికేషన్ అంటూ పలువురు అభినందిస్తున్నారు . ఇక ఈ మూవీ ఊపు చూస్తుంటే కాంతారా మొదటి భాగానే ఢీకొట్టే విధంగా ఉంది . మరి ఈ మూవీ అయితే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది .