
ఫస్ట్ 16న విడుదల కానున్న “మిత్రమండలి” సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. బన్నీ వాస్ నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ట్రైలర్, టీజర్‌లతోనే సినిమా మీద అంచనాలు వచ్చేశాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్, అనీల్ రావిపూడి శిష్యుల స్టైల్ హాస్యం కలిసితే సినిమా మంచి హిట్ అవ్వడం ఖాయం. 15న ప్రీమియర్ షో ప్లాన్ చేయడం కూడా సినిమా యూనిట్ కాన్ఫిడెన్స్ చెపుతోంది. ఇక 17న రెండు సినిమాలు రాబోతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ నటించిన “తెలుసు కదా” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వస్తోంది. “మిరాయ్” విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ బ్యానర్ ఇప్పుడు మరో హిట్ కొట్టాలనే ధీమాలో ఉంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, థమన్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణగా మారింది. సిద్దు గత చిత్రం “జాక్” ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఈసారి మాత్రం బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.
అదే రోజున మైత్రీ మూవీస్ నుంచి “డ్యూడ్” విడుదల అవుతోంది. “లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో యువతలో పాపులర్ అయిన ప్రదీప్ రఘునాథ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ట్రైలర్‌లోనే ఎనర్జీ, ఫన్ బావుండటంతో, థియేటర్లలో కూడా అదే మేజిక్ కొనసాగితే ప్రదీప్‌కి హ్యాట్రిక్ హిట్ ఖాయం. తర్వాతి రోజు 18న కిరణ్ అబ్బవరం నటించిన “కె.ర్యాంప్” ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందించబడింది. టీజర్, ట్రైలర్‌లలోనే కిరణ్ కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త స్టైల్ ఆకట్టుకున్నాయి. దీపావళి చివర్లో రిలీజ్ అవ్వడం కూడా ఈ సినిమాకు ఫ్లస్ కావచ్చు. మొత్తం మీద ఈ దీపావళి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను కిక్కిరిసేలా చేయనుంది. ఒకే వారం నలుగురు హీరోల సినిమాలు పోటీ పడుతుండటంతో థియేటర్లు సందడిగా మారడం ఖాయం. వీటిలో కనీసం రెండు హిట్టైనా ఈ ఫెస్టివల్ సీజన్‌కు చక్కటి బూస్ట్ అవుతుంది.