టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమాలో అత్యంత భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ సినిమా షూటింగ్ డీలే అవుతూ వచ్చింది. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితమే ప్రకటించారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పనులు పూర్తి కాగానే వశిష్ట , రవితేజ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వశిష్ట కొంత కాలం క్రితమే రవితేజ ను కలిసి ఓ మూవీ కథను వినిపించినట్లు , అది బాగా నచ్చడంతో రవితేజ కూడా వశిష్ట దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వశిష్ట "విశ్వంబర" సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు , ఆ సినిమా పనులు పూర్తి కాగానే రవితేజ సినిమాకు సంబంధించిన పనులను ఆయన స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు 45 కోట్ల బడ్జెట్ను అనుకుంటున్నట్లు , అందులో 25 కోట్ల రూపాయలు రవితేజ పారితోషకం గానే తీసుకోనున్నట్లు , మరో 20 కోట్ల ఖర్చుతో ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేసే విధంగా మేకర్స్ ప్లాన్ కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: