టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత డాక్టర్ కేఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ భారీ పాన్ ఇండియా ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ హిందూ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ లో ఆ కాశీ సెట్ లో హీరో మహేష్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇంద్ర సినిమా కూడా కాశీ బ్యాక్ డ్రాప్ లోనే ఫస్టాఫ్ నడుస్తుంది.
ఆ సినిమాకు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేకంగా కాశీ పుణ్యక్షేత్రం సెట్ వేశారు. ఇప్పుడు మహేష్ - రాజమౌళి పాన్ ఇండియా సినిమాకు కాశీ క్షేత్రం సెట్ వేస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా గురించి స్టార్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి హింట్ ఇచ్చారు. తాను .. దర్శకుడు రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అని తెలిపారు. ఇక రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఎంఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి