- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రవితేజ మాస్ జాతర సినిమా సోమవారానికి పూర్తిగా తేలిపోయింది. అసలు శని , ఆదివారాలు కూడా ఈ సినిమాను పూర్తిగా ఎవరూ పట్టించుకోలేదు. భాను అనే రచయిత తొలిసారి మెగా ఫోన్ పట్టి తీసిన సినిమా ఇది. మాస్ మ‌హా రాజ్  సినిమాని 360 డిగ్రీలలో కొలిచిన ఒక్క డిగ్రీలోనూ కొత్తదనం కనిపించదు. అసలు ఇలాంటి రొటీన్ కథలో ఏమి న‌చ్చి సినిమా తీశారు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రవితేజ చాలా పోలీస్ పాత్రలు చేశాడు కాకపోతే రైల్వే పోలీస్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని అందరూ అనుకున్నారు.


హీరోని రైల్వే పోలీస్ చేయ‌డంలో కొత్త‌గా ఏం సాధించారో కూడా భూత‌ద్దంలో పెట్టి వెతికినా అర్థం కాదు. రైల్వే పోలీస్ కంటూ కొన్ని లిమిటేష‌న్స్ ఉంటాయి. వాళ్ల ప‌నితీరు రెగ్యుల‌ర్ పోలీస్ లా ఉండ‌దు. ప‌రిధి కూడా చాలా త‌క్కువ ఉంటుంది. అయితే ఇక్క‌డ డైరెక్ట‌ర్ భాను హీరో ర‌వితేజ రైల్వే పోలీస్ కాబ‌ట్టి, త‌న ప‌రిధి త‌క్కువ కాబ‌ట్టి.. నేరాలూ, ఘోరాలూ అన్నీ ఆ పరిధిలోకి బ‌ల‌వంతంగా లాక్కొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. హీరోయిన్ పాత్ర‌ను మ‌రింత అధ్వానంగా కూనీ చేసి ప‌డేశారు.


పైగా టీచ‌ర్ అంటూ ఆ పాత్ర‌ను ప్ర‌వేశ పెట్టి.. ఆ త‌ర్వాత హీరోయిన్ పాత్ర‌తో గంజాయి అమ్మించారు. రైల్వే స్టేష‌న్ లో గంజాయి కాలుస్తున్న వాళ్ల‌ని తుక్కు రేగ్గొట్టిన హీరో గారు.. హీరోయిన్ గంజాయి అమ్మితే మాత్రం ఆమెతో డ్యూయ‌ట్ వేసుకుంటాడు. ఆ త‌ర్వాత గంజాయి అమ్మేంద‌కు చెప్పిన కార‌ణం కూడా కృత‌కంగా అనిపిస్తుంది. ఏదేమైనా ర‌వితేజ ఈ రొటీన్ జాత‌ర్ల‌తో జ‌నాల‌కు పిచ్చెక్కిస్తూ ఆయ‌న మారేలా లేరు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: