మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సినిమా సైరా. రూ.250 కోట్ల భారీ బ‌డ్జెట్తో సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ విష‌యంలో చిత్ర యూనిట్ చాలా ఇబ్బంది ప‌డింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ మ్యాజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది సైరా న‌ర‌సింహారెడ్డికి మ్యూజిక్ ఇస్తున్నారు.


అమిత్ వ‌ర్కింగ్ స్టైల్ నచ్చిన మెగాస్టార్ చిరంజీవి అమిత్‌నే త‌న 152వ సినిమాకు కూడా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సైరా లాంటి క్రేజీ మూవీకి ముందుగా అనుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు హ్యాండ్ ఇవ్వ‌డంతో డిజ‌ప్పాయింట్లో ఉన్న చిరును త‌న వ‌ర్క్‌తో అమిత్ సూప‌ర్‌గా మెప్పించాడ‌ట‌. అందుకే కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో తాను త‌దుప‌రి సినిమాకు కూడా, అమిత్ త్రివేదికే సంగీత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇవ్వాల‌ని చిరు ఫిక్స్ అయ్యాడ‌ట‌.


అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. కొర‌టాల త‌న ప్ర‌తి సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే మ్యూజిక్ ఇస్తారు. వారిద్ద‌రిది బాగా క‌లిసొచ్చిన కాంబినేష‌న్ మ‌రి ఇలాంటి టైంలో చిరు అమిత్ త్రివేదికి ఓటేస్తే కొర‌టాల అందుకు ఒప్పుకుంటాడా ? అన్న సందేహం కూడా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: