సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావడమే గొప్ప అనుకునే ఈ కాలంలో కొంత మంది నటులు చేసే పొరపాటు వల్ల వారి కెరీర్ అనుకోకుండా పతనం అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి..తాజాగా మళియాళ హీరో దిలీప్ తాను చేసిన అపరాదానికి ఇప్పుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్న విషయం తెలిసిందే.
తన పర్సనల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనను ఇబ్బంది పెట్టందని భావించి..తమిళ నటి భావనపై కుట్రపన్ని ఆమె డ్రైవర్ తో లైంగిక వేధింపులు చేసేందుకు వారిని పురిగొలిపినట్లు కోర్టు లో తేలడంతో దిలీప్ ని జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక దిలీప్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోగా..పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టులో చెప్పారు. మరోవైపు దిలీప్ తరుపు న్యాయవాది ఈ కేసులో అతనికి ఏమాత్రం ప్రమేయం లేదని వాదిస్తున్నారు.
జూలై 10న అరెస్టైన దిలీప్ ఇప్పటివరకు ఐదు సార్లు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. అందులో మూడు సార్లు కేరళ హైకోర్టును, రెండు సార్లు దిగువ కోర్టును సంప్రదించాడు. అయితే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా పక్కాగా ఆధారాలు ఉండటంతో ఇప్పటివరకు బెయిల్ మంజూరు కాలేదు. ప్పటి వరకు దిలీప్ ఎన్ని పర్యాయాలు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్న కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.
అయినప్పటికీ ఐదో సారి ఆయన బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. ఈసారి దిలీప్ అభ్యర్థనను అంగీకరిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 85 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత ఎట్టకేలకు దిలీప్ బెయిల్ మీద బయటకు రానున్నాడు. మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.