టాలీవుడ్ లోకి ‘ముకుంద’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది..వెంటనే ‘కంచ’లాంటి ప్రయోగాత్మక సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ ఈ సంక్రాంతి పండుగ కానుకగా వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్2’గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్.
తమిళంలో వరుణ్ పాత్ర బాబీ సింహ పోషించాడు. అయితే ఈ సినిమాలో బాబీ సింహా చాలా మాస్ లుక్ తో కనిపిస్తాడు..ప్రస్తుతం వరుణ్ తేజ్ కూడా చాలా రఫ్ గా గెడ్డం పెంచుకొని చెవికి రింగు పెట్టుకొని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ కనిపించబోతున్నా డట. గతంలో పూరి దర్శకత్వం వహించిన ‘టెంపర్’సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ మొత్తం నెగిటీవ్ షేడ్స్ లోనే కనిపిస్తాడు.
వరుణ్ తేజ్ కూడా వాల్మికీ లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించడం కోసం ఈ గుబురుగా పెరిగిన గెడ్డం,మీసాలతో, కొత్తరకం హెయిర్ స్టైల్ కనిపిస్తున్నాడు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రను అధర్వ చేస్తున్నాడు. తమిళ బ్యూటీ మృణాళిని ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు.