మహర్షి 9.2 టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టి నిరాశపరచగా ఓబేబీ 9టీఆర్పీ రేటింగ్స్ ను సాధించింది. ఈరెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో ప్రసారం కావడంతో మహర్షి ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను రాబట్టలేకపోయింది. ఇక డిజిటల్ స్క్రీనింగ్ విషయానికి వస్తే మహర్షి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఓ బేబీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు లో నటిస్తూ బిజీగా ఉండగా కొద్దీ రోజుల క్రితం 96తెలుగు రీమేక్ ను షూటింగ్ ను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా వుంది. అయితే అవకాశాలు లేక సమంత ఖాళీగా లేదు. ఆఫర్లు వస్తున్న కానీ ఎందుకనో ఓ బేబీ తరువాత ఇంతవరకు ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు.అయితే ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లో సమంత నెగిటివ్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పిందట.