‘అందాల రాక్షసి’ హీరో నవీన్ చంద్ర తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే పెరులోకి వస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు పది సినిమాల వరకు నటించిన ఈ హీరోకు మన టాలీవుడ్ లో కూడ కొంత మంది అభిమానులు ఉన్నారు. ఈ యంగ్ హీరోను ఓ యంగ్ హీరోయిన్ రియల్ లైఫ్‌లోనూ తీవ్రంగా వేధిస్తోందని కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పు మంటున్నాయి.
తన కెరియర్ ను డేమేజ్ చేసే విధంగా ఒక యంగ్ హీరోయిన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని నవీన్ చంద్ర తన స్నేహితుడైన కోలీవుడ్ జర్నలిస్టుతో షేర్ చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ హీరోతో హీరోయిన్గా నటించన రెండు సినిమాల హీరోయిన్ తనను రెగ్యులర్‌గా వెంటాడుతూ లొకేషన్స్‌లో డిస్ట్రబ్ చేస్తోందని నవీన్ చంద్ర ఓపెన్ గా చేపుతున్నాడని టాక్.
అంతేకాకుండా తామిద్దరూ ఫ్రెండ్లీగా ఉన్న ఫోటోస్‌ను, సెల్ఫీస్ను నవీన్ ఇంటికెళ్ళి మరీ అతని ఫ్యామిలీ మెంబర్స్‌కి, కొందరు ఫ్రెండ్లీ యంగ్ హీరోస్‌కి చూపిoచి. ‘మేమిద్దరం లవ్‌లో ఉన్నాం నవీన్ నాకే సొంతం ఇద్దరం కెరియర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుంటాం’ అని తనకుతానే ఆ హీరోయిన్ చేస్తున్న ప్రచారంతో ఈ యంగ్ హీరో బెదిరి పోతున్నాడని కోలీవుడ్ టాక్.
అంతేకాదు ఈ హీరోతో నటిస్తున్న హీరోయిన్స్ ను కూడా టార్గెట్ చేస్తున్న నవీన్ చంద్ర ప్రేమికురాలి బాధను భరించలేక ఈ హీరోతో నటించడానికి హీరోయిన్స్ కూడ ఇష్టపడటం లేదు అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. అయితే ఆ హీరోయిన్ పేరు పై మాత్రం రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: