అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొంత మంది కొన్ని రకాల పద్ధతులను ఫాలో అవడం జరుగుతుంది. అవి కూడా వారి వారి హోదా, స్థాయి ని బట్టి ఉంటాయి. అయితే హోదా, స్థాయి అనే అంశాలను పక్కనబెడితే చేసిన లవ్ ప్రపోజల్ ఎదురుగా ఉన్న అమ్మాయికి ఇష్టం అయితే ఇంకే ముంది గురిడికి కళ్యాణ ఘడియలు వచ్చేసినట్లే. ఇటీవల కాలంలో చాలా మంది తాము ప్రేమిస్తున్న అమ్మాయిలకు వివిధ రకాలుగా లవ్ ప్రపోజ్ చేసి దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరొక వార్తే ఇప్పుడు హాట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్. 


క్యూట్‌ లవ్‌ ప్రపోజల్‌.. వైరల్‌ వీడియో

 విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్‌ చేసిన లవ్‌ ప్రపోజల్‌ వైరల్‌ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎయిర్‌ హోస్టెస్‌ తమ పనుల్లో మునిగిఉండగా ఇంతలో పైలట్‌ అక్కడకు వచ్చాడు. విమానంలో ఉండే ఫోన్‌ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్‌ హోస్టెస్‌ అతడివైపు కదిలింది. ఇంతలో అతడు మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె చేతిని పట్టుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. జీవితాంతం ఈ చేతిని వదలను అంటూ ఆమె కళ్లలోకి చూసి చెప్పాడు.


Image result for love

పైలట్ చొరవకు మొదట ఆమె ఆశ్చర్యచకితురాలైనా.. ఆపైన అతడి ప్రపొజల్‌ కు ఒకే చెప్పింది. సినిమాలో సీన్‌ లా ప్రయాణికులందరూ చూస్తుండగానే పైలట్‌, తన ప్రియురాలికి రింగ్‌ తొడిగి తన ప్రేమను గెలిపించుకున్నాడు. ఆ తరువాత విమానంలో అందరూ చప్పట్లు కొడుతుండగా ఆ ప్రేమికులిద్దరూ కౌగిలించుకుని ముద్దుల్లో మునిగితేలారు. ఆ వెంటనే విమానంలోని ఫోన్‌ తీసుకుని తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఎయిర్‌ హోస్టెస్‌ తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: