నేటి ఆధునిక యుగంలో యువత ఆలోచనా విధానాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఆలోచనా విధానాన్ని పెడదారి పట్టిస్తున్న అంశం ఆకర్షణ. యుక్త వయసు అబ్బాయిలు, అమ్మాయిలు అందరి చూపు వారిపై తిప్పుకోవాలని తహతహలాడడం సహజం. అందుకు వారు అందరికంటే కాస్త విభిన్నంగా రెడీ అవడం మనం గమనించవచ్చు. కానీ ఈ ఆలోచనా ధోరణిలో మరీ మితిమీరిన మార్పులు వస్తే అది వారి జీవితానికే నష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సమాజంలో వివిధ రకాల వృత్తుల కుటుంబాల పిల్లలు ఎంతో మంది కాలేజీల్లో విద్యను కొనసాగిస్తున్నారు.


Image result for love attraction

కాలేజీ అన్నాక పరిచయాలు సహజం. కానీ ఈ పరిచయం మితిమీరితే నే ప్రమాదం అనే విషయం వారికి తెలిసినా హద్దు దాటుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఒక చిన్న వ్యాపారం చేస్తున్న తండ్రి కి కొడుకు చేదోడు వాదోడుగా నిలవాల్సింది పోయి తండ్రికి సహాయం చేస్తూ తను కూడా ఆ వ్యాపారాన్ని చేస్తే తన తోటి చదువుకునే అమ్మాయిలు తనను అదోలా చూస్తున్నారని తనతో మాట్లాడడానికి ఆసక్తి కనబరచడం లేదని తన తండ్రికి సహాయం చేయడమే మానేశాడట.


Related image

కారణం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల అమ్మాయిలు తనను అసహ్యించుకుంటున్నారని అతని భావన. ఇలాంటి ఆలోచన తప్పు. హై ఫై గా కనిపిస్తేనే.. కార్లల్లో తిరుగుతేనే అమ్మాయిలకు నచ్చుతామని అనుకోవడం మన భ్రమ. అసలు ఒక వ్యక్తి అమ్మాయులకే కాదు మరో సాటి మనిషికి నచ్చాలంటే మనలో ఉండాల్సినవి మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, ప్రవర్తన ఇవన్నీ మనుషులను గొప్ప వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. ప్రస్తుతం సమాజంలో రాణిస్తున్న గొప్ప వ్యక్తులంతా కూడా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డవారే. ఈ విషయాలను గమనించినట్లయితే ఏ కొడుకు తన తండ్రి వృత్తికి కలంకితం కాబోడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: