ఆర్టీసీ సమ్మెపై   సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా రెండు వైపుల నుంచి ఎక్కడా ఆ వాతావరణం కనిపించటం లేదు. తాము చర్చలకు సిద్ధమే నని, కానీ ఎవరితో చర్చించాలో తేల్చాల్సింది ప్రభుత్వం అని సంఘాలు చెబు తుండగా  ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మరో సారి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవ కాశం కనిపిస్తోంది.

కోర్టు ఏం చెబుతుందోనని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందిఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హుటా హుటిన రాజ్‌భవన్‌ చేరుకొని సమ్మె పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో సమ్మెకు పరిష్కారం లభించే అవ కాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిల్‌పై కొనసాగిన వాదనల సమయంలో హైకోర్టు పలు సూచ నలు చేసింది. శుక్రవారం మరోసారి ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. సమ్మె మొదలైన తొలి రోజు సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నట్టేనంటూ తేల్చిచెప్పిన సీఎం.. బుధవారం రాత్రి రవాణాశాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శితో సుదీర్ఘంగా చర్చించారు. .

ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం లేదని అధికారులు చెబుతుండటంతో కోర్టు చేసే సూచ నల ఆధారంగా శుక్రవారం కీలక నిర్ణ యాలు వెలువడే అవకాశం ఉందని  భావిస్తున్నారు.కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచర ణను కొనసాగిస్తున్నాయి. 13వ రోజు సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధూంధాం నిర్వహించాయి.  నిరసనల్లో పాల్గొన్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడి జరగనుందనే సమాచారంతో గురువారం పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రగతి భవన్‌ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసి ఓయూ క్యాంపస్‌ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు నిర్వహించారు. రామ్‌నగర్‌ చౌరస్తాలో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు వెళ్లిన ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్‌ హనుమంతు సహా కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అక్కడే ధూంధాం నిర్వహిస్తామని, దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ హాజరవుతారని ఆయన వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: