గత కొద్ది కాలంగా విజయమ్మ, జగన్ తో కొన్ని విషయాలలో విభేదిస్తున్నారు అని తెలుస్తోంది. అదేవిధంగా ఇడుపులపాయ కేం ద్రంగా అన్నా,చెల్లెళ్ల మ‌ధ్య వివాదం ఒక‌టి నడుస్తోంది అని స‌మాచారం. వాస్త‌వానికి నాడు వైఎ స్సార్సీపీ గెలుపున‌కు, పార్టీ మ‌ను గ‌డ‌కు ష‌ర్మిల ఎంతో కృ షి చేసిన మాట వాస్త‌వం. అన్న పార్టీ కోసం అండ‌గా నిలిచి, పాదయాత్ర చేసి త‌న‌దైన హ‌వాను కొన‌సాగిం చారు. ఆడ పిల్ల అయినా ఎక్క‌డ అద‌ర‌క బెద‌ర‌క మొం డి ధైర్యంతో కొన్నివేల కిలోమీట‌ర్లు న‌డిచి జ‌గ‌న‌న్న విడిచిన బాణాన్ని అం టూ ప్ర‌సంగాలు ఇచ్చి ప్ర‌జల దృష్టిని ఆక‌ర్షించారు. రాజ‌న్న బిడ్డ‌ను నేను..ఆద‌రించండి న‌న్ను..అని పేర్కొంటూ వారి దీవెన‌లు అందుకునేందుకు ప్ర‌య‌ త్నించారు. సంబంధిత శ్రేణుల‌ను, వ్య‌క్తుల‌ను ఏక‌తాటిపై నిలిపి విజ‌యం సాధించారు. అన్న జైల్లో ఉన్నా పార్టీకి ఏ క‌ష్టం రానీయ‌క తానే అన్నీ అయి, ఆర్థిక లోటును కూడా తానే భ‌రించి ముందుకు వెళ్లారు. (ఆ రోజుల్లో వైఎ స్సార్సీపీకి ష ర్మిల భ‌ర్త, సువార్త స‌భ‌ల ప్ర‌సంగీకులు బ్ర‌ద‌ర్ అనీల్ నిధులు స‌మ‌కూర్చేవార‌న్న వార్త‌లు కొన్ని వ‌చ్చేవి)  కాంగ్రెస్ త‌మకు అన్యా యం చేసింద‌ని ప్ర‌తి చోటా వ్యాఖ్యానించి, ఆ పార్టీ ఇమేజ్ ను పూర్తిగా ప‌డ‌గొట్టా రు. తీవ్ర వ్యాఖ్య‌లు చేసి త‌రుచూ వార్త‌ల్లో నిలిచారు. కానీ కాలక్ర‌మంలో వైఎస్.జ‌గ‌న్  అధికారం లోకి వ‌చ్చాక  ష‌ర్మిల తెర వెనుక‌కే ప‌రిమితం అయ్యారు. స్త‌బ్దుగా ఉండిపోయారు.



అన్నయ్య సీఎం అయ్యాక కొన్ని సంద‌ర్భాల‌లో త‌ప్ప! త‌రువాత పెద్ద‌గా ఆమె క‌నిపించ‌లేదు. త‌న‌కు అన్న‌య్య స‌ర్కారులో త‌గిన ప్రాధాన్యం అన్నది ద‌క్క‌కుండా పోయింది అన్న బాధ చాలా కాలం ఆమెను వెన్నాడింది. క‌ష్ట‌కాలంలో శ‌క్తివంచ‌న లేకుండా క్షేత్ర స్థాయిలో ప‌నిచేసినా కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న ప‌ద‌వి ఏదీ ఆమెను వ‌రించ‌లేదు. ఇది కూడా ష‌ర్మిల కొత్త పార్టీ పె ట్టేందుకు కార‌ణం అయింది. కానీ వైఎస్సార్టీపీ ఎదు గుదల అన్న‌ది విజయ మ్మ కోరుకున్న విధంగా జరగడం లేదు. ఆరంభంలోనే అనేక ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి.


ఈ దశలో కూడా కొన్ని త‌ప్పు లు కూడా వెలుగు చూశాయి. త‌మ‌ని తెలంగాణ‌లో క‌న్నా ఆంధ్రాలోనే ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కాన్ని బలప‌ర్చే విధంగానే జ‌రుగుతున్న ప‌రిణామాలు ఉండ‌డంతో వైఎస్సార్టీపీని బ‌లోపేతం చేసే క‌న్నా సొంతంగా పార్టీ పెట్టి జ‌గ‌న్ పై పో రాటం చేయడ‌మే మేలు అన్న భావన‌లో విజ‌య‌మ్మ ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఆస్తి తగాదాలు అన్న‌వి అన్నాచెల్లెళ్ల మ ధ్య వ్యక్తిగతమైన విషయాలు క‌నుక  పెద్దగా అవి బయట ప్రపంచానికి తెలియలేదు. ఈ నేపథ్యంలో సొంతంగా ఒక పార్టీని ఏర్పా టు చేసి జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్రాలో ని లదొక్కుకోవాలని ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

ysr