దేశంలో ఇప్పటివరకు కరోనా సంక్షోభం తో రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతే, తాజాగా బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వలన విద్యుత్ సంక్షోభం వస్తుందని వార్తలు వస్తున్నాయి. అవి నిజామా అబద్దమా అనేది పక్కన పెడితే, కేంద్రం మాత్రం ఆ స్థితి ఏమిలేదని స్పష్టం చేసింది. అయినా అవసరం అయితే దిగుమతి చేసుకుంటున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పక్క దిగుమతి చేసుకుంటున్నట్టు కూడా కేంద్రం స్పష్టంగా చెప్పడంలేదు. కానీ ఆయా రాష్ట్రాలలో మాత్రం ధర్మల్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కోసం ఉంచిన బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ నిల్వలు అయిపోతే విద్యుత్ కోతలు తప్పవు అనేది ఆయా రాష్ట్రాల ముఖ్య సమస్య.

ఒకపక్క ఉపఎన్నికలు మరోపక్క ఈ విద్యుత్ సంక్షోభం, ఈ ప్రభావం ఆయా ప్రభుత్వాల ఓటు షేరింగ్ పై ఉంటుందనేది అందరి మదిలో ఉన్న సమస్యే. అందుకే ఈ విషయాన్నీ బాహాటంగా చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటోంది కేంద్రానికి కూడా. బహుశా అందుకే విద్యుత్ సంక్షోభం ఏమి లేదు, అవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టిపడేస్తుంది. ఉన్న సమస్యను చెప్పకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఆయా రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో వ్యవహరించాల్సి వస్తుంది, కారణం ఎన్నికలే.

అయితే కేంద్రం మాత్రం బ్రిటన్ వంటి దేశాల నుండి బొగ్గు  చేసుకుంటున్నప్పటికీ, అవసరాలకు తగ్గట్టుగా ఆ పరిమాణం సమకూరడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ సమస్యను తొక్కి పెడితే, ఓటింగ్ సమయంలో ఇది గుర్తు రాకుండా చూసుకోవచ్చు అనేది ఆయా పార్టీల ఆలోచన లాగానే ఉంది. అందుకే ప్రజలకు మాత్రం ఏ సమస్య లేదు అని చెపుతున్నప్పటికీ, విద్యుత్ కోతలు కొన్ని చోట్ల తప్పట్లేదు. దీనితో విద్యుత్ సంక్షోభం వచ్చిందని ప్రజలలో అపోహలు మాదిరిగా అయినా ఈ విషయం బయటకు పొక్కుతుంది. కొన్నాళ్లు ఉంటె ఏ సమస్య అయినా తీరిపోవచ్చు, కానీ అప్పటి వరకు దానిని జాగర్తగా సమన్వయము చేయడం ద్వారా ఉపఎన్నికలలో ప్రభావం చూపకుండా చూస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: