రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం గురించి, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగర్తల గురించి కాప్26 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశం ద్వారా ఆయా దేశాలు కాలుష్య నివారణకు తమతమ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా ముందుకు పోనున్నాయి. భూమిలో లభించింది కదా అని ముందు వెనుక ఆలోచించకుండా వాడిన కొన్ని వనరుల కారణంగా వాతావరణంలో తీవ్రంగా కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. దీనికి ఏ దేశం కారణం అయినప్పటికీ అందరు కలిసి ఉమ్మడిగా దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ప్రపంచదేశాలు గుర్తించాయి. అందుకోసమే తాజా సమావేశం కూడా జరుగుతుంది. దీనివలన ఆయా దేశాలు తమ తమ దేశాలలో కర్బన ఉద్గారాల ను తగ్గించడానికి తీసుకోవాల్సిన అనేక చర్యలను వెల్లడిస్తారు, అలాగే తదుపరి సమావేశంలో ఆయా లక్ష్యాలను ఎంతవరకు సాధించింది కూడా పరిశీలించుకుంటారు.

అయితే ఈ సమావేశాలలో చెప్పుకోదగ్గ పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద సంస్థలు 2040 నాటికి తమ సంస్థల నుండి విద్యుత్ ఆధారిత వాహనాలు తప్ప పెట్రో లేదా డీజిల్ ఆధారిత వాహనాలు ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేశాయి. అంటే దాదాపుగా 2040 తరువాత రోడ్లపై విద్యుత్ వాహనాలు తప్ప మరో వాహనం కనిపించక పోవచ్చు. ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయం భూతాపాన్ని తగ్గించడంలో ఎంతో ముందడుగుగా నిపుణులు పరిగణిస్తున్నారు. రేపటితో ముగియనున్న ఈ సమావేశాలలో బుధవారం ఐక్యరాజ్యసమితి వాతావరణాన్ని కాపాడే ఏజెన్సీ ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో ఎక్కువగా గ్రీన్ హౌస్ ద్వారా వెలువడే వాయు ఉద్గారాల తగ్గింపు గురించి ప్రస్తావించారు.  

ఈ సమావేశాలలో ఆయా లక్ష్యాలను దాదాపుగా 200 దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకోవడం అత్యవసరం. అందుకు బొగ్గు, గ్యాస్, చమురు ఆధారిత ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేలా ప్రజలలో కూడా చైతన్యం తేవడం చాలా అవసరం అని సమితి అభిప్రాయపడింది. అందుకోసం ఆయా ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయడం ఒక మార్గం. ఈ ఏడాది లక్ష్యంగా కనీసం 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉష్ణోగ్రతల పెంపు కారణంగా అడవులు కాలిపోవడం, వరదలు, కరువు వంటి సమస్యలు అధికం అవనున్నాయి. ఇప్పటికే భూతాపం 1.1డి.సెంటి. పెరిగినట్టు శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: