మ‌తం వేరు  మ‌త వాద రాజ‌కీయం వేరు అన్న‌దే త‌రుచూ వినిపించే మాట. మతం క‌న్నా మ‌త వాదం ప్ర‌బ‌ల శ‌క్తిగా మారిపోతే అప్పుడు కొన్ని క‌ల్లోలితాల సృష్టి కొన్ని అరాచ‌క వాద శ‌క్తుల‌కు సులువు అవుతుంది.దేశంలో మైనార్టీల ర‌క్ష‌ణ ఎంత ముఖ్య‌మో, మెజార్టీల ర‌క్ష‌ణ కూడా అంతే ముఖ్యం.. కాద‌నం కానీ మెజార్టీ వాదం కార‌ణంగానే మైనార్టీలు త‌మ ఆత్మ ర‌క్ష‌ణ‌కు  ప్రాధాన్యం ఇవ్వాల‌న్న వాద‌న కూడా ఎప్ప‌టి నుంచో ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర వినిపిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేయాల్సింది మ‌త రాజ‌కీయం కాదు కానీ చేయాల‌నుకుంటున్న తీరు మాత్రం అస్స‌లు అంగీకార యోగ్యం కాదు. ప్ర‌జా స‌మ‌స్య‌లు వదిలి ఎవ‌రు హిందు ఎవరు కాదు ఎందుకు కాదు కాశీ విశ్వేశ్వ‌రుడే అందుకు సాక్షిలాంటి మాట‌లు రాజ‌కీయం ఉప‌యోగించుకునేందుకే త‌ప్ప మ‌రో ఉద్దేశం అయితే వీరిలో లేదు. ప్ర‌జా క్షేమం కోరి చేసే రాజ‌కీయాల‌కు ఇవి నిలువుట‌ద్దం కాబోవు.

ఎప్పుడు ఎన్నిక‌లు అయినా ఎన్నిక‌లు రాక‌పోయినా వ‌స్తున్నాయ‌న్న భ్ర‌మ‌లో అయినా కాంగ్రెస్, బీజేపీ ఉంటాయి. ఉండాలి కూడా! హిందుత్వ వాదాలు సంబంధిత ఆచార సంబంధ వాదాలు తెర‌పైకి తెస్తే ఒక‌రినొక‌రు హాయిగా దూషించుకునేందుకు వీలుంటుంది. పెద్ద‌గా ప‌ట్టుకు చిక్క‌ని స‌బ్జెక్ట్ అయితే ఇది కాదు. క‌నుక ఇట‌లీ సోనియాని, ఆమె బిడ్డ రాహుల్ ని ఏదో ఒక విధంగా ఇలాంటి వివాదంలో సులువుగా లాగొచ్చు లేదా ఇరికించవ‌చ్చు అన్న‌ది ఓ భావ‌న‌. రాజ‌కీయంలో క్రిస్టియానిటీ కి ప్రాధాన్యం ఉందా లేదా అన్న‌ది అటుంచితే వీళ్లు కేవ‌లం హిందు అన్న ప‌దంతోనే రాజ‌కీయం న‌డిపి నాలుగు ఓట్లు దండుకునే ప‌ని ఒక‌టి చేస్తున్నార‌న్న‌ది బీజేపీ పై ఉన్న వివాదం. వివాదాలేవీ కొత్త కాక‌పోయినా బీజేపీ మాత్రం  రాహుల్ ని హిందువు అని నిరూపించుకోమ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది.


దైవ భ‌క్తి దేశ భ‌క్తి రెండూ వేర్వేరు అనుకోకు రాహుల్.. అలానే మోడీ సాబ్ మీకు కూడా ఇవే మాట‌లు వ‌ర్తిస్తాయి. దేశం అంతా త‌మదే అనుకోవ‌డంలో మోడీ, దేశాన్ని త‌నదైన శ‌క్తితోనో యుక్తితోనో న‌డిపే శ‌క్తి రేప‌టి వేళ త‌న‌దేన‌ని రాహుల్ అనుకోవ‌డంలో వింత లేదు. విడ్డూరం అంత‌క‌న్నా కాదు కానీ అంద‌రికీ ఒకే ప్లాట్ ఫాం కావాల్సి రావ‌డం అందుకు వార‌ణాశి లాంటి ప్ర‌సిద్ధ పుణ్య ధామాలే వేదిక‌లు కావ‌డం విడ్డూరం. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ హిందువు అనే మాట కు హిందుత్వ అనే నినాదానికి మ‌ధ్య రాజ‌కీయం న‌డుస్తుండ‌డం ఇప్ప‌టి చ‌ర్చ‌కు కార‌ణం. రాహుల్ గాంధీ త‌న‌ని తాను హిందువు అని చెప్పుకునేందుకు ఆ విధంగా చెప్పుకునే తీరులో త‌న‌ని తాను ఇష్ట‌ప‌డేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం ఓ క‌థ‌లో ఓ మ‌లుపు. ఉత్త‌రాదిన హిందువు అని చెప్పుకోవ‌డంలో రాజ‌కీయ నాయ‌కుల‌కు ఓటు బ్యాంకు రాజ‌కీయాల దృష్ట్యా అవ‌స‌రం అయి ఉండ‌వ‌చ్చు. హిందువు అయినా కాకున్నా మ‌తం పేరిట ఎటువంటి కుట్ర‌ల‌కు త‌గాదాల‌కు ఇబ్బంది క‌ర ప‌రిణామాల‌కు జీవించే హ‌క్కు కాల‌రాసేందుకు కొన్ని త‌ప్పుడు ప‌నులు చేయ‌కుండా ఉంటే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: