ఏపీలో కాపు వర్గం సెంటర్‌గా రాజకీయాలు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కాపుల అంశం ఎక్కువగా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా వంగవీటి రాధా ఎపిసోడ్‌తో సీన్ మొత్తం మారింది. అలాగే ఇటీవల ఏపీ కాపు నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇక కాపులు తమ హక్కుల కోసం పోరాడాలని, ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే కాపులకు న్యాయం జరిగేలా చూసుకోవాలని మాట్లాడుకున్నారు.

అయితే కాపు నేతలు పూర్తిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వంగవీటి, వైసీపీకి యాంటీగా, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ కల్యాణ్ సైతం జగన్ ప్రభుత్వానికి యాంటీగానే ఉన్నారు. ఆయన, చంద్రబాబుతో కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లు...కాపులని ఏకం చేసి టీడీపీకి మద్ధతు దక్కేలా ముందుకెళ్లడానికి చూస్తున్నారు.

ఇలా కాపులు పూర్తిగా జగన్ ప్రభుత్వానికి యాంటీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో జగన్‌కు అనుకూలంగా ఉండే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కాపులు ఏకం అవ్వాలని, బీసీ, ఎస్సీ, మైనారిటీలు కలిసి అధికారం దక్కించుకోవాలని లేఖలు రాస్తున్నారు. ఆ రెండు కులాలకే ఎప్పుడు అధికారం దక్కాలా? అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే కాపులు టీడీపీకి అనుకూలంగా మారుతున్న నేపథ్యంలోనే ముద్రగడ ఇలా లేఖలు రాయడం స్టార్ట్ చేశారని, గతంలో అలాగే టీడీపీని దెబ్బకొట్టి జగన్‌కు హెల్ప్ చేశారని, ఇప్పుడు అలాగే ముందుకెళ్లడానికి చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

అయితే ముద్రగడ లేఖలని కాపులే నమ్మడం లేదని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన రాజకీయం అందరికీ అర్ధమైంది. కాపు ఉద్యమం పేరిట కేవలం జగన్‌కు బెనిఫిట్ అయ్యేలా చేశారు. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రానిచ్చేలా లేరు. ఇప్పటికే ముద్రగడకు కాపులే కౌంటర్లు ఇచ్చే పరిస్తితి ఉంది. కాబట్టి ముద్రగడ ఇచ్చే ట్విస్ట్‌లకు కాపులే రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: