సాధారణంగా వైసీపీలో రెడ్డి సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎలాగో రెడ్డి కాబట్టి..ఆ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తారు. కనిపించడమే కాదు...వైసీపీలో రెడ్డి నేతలదే హవా అని చెప్పొచ్చు. అలా అని టీడీపీలో రెడ్డి వర్గం నేతలు కూడా ఉన్నారు. వారు కూడా చంద్రబాబు కోసం బాగానే కష్టపడతారు. మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో టీడీపీ రెడ్డి నేతలు టోటల్‌గా ఫెయిల్ అయ్యారు...కానీ ఈ సారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదని చెప్పి రెడ్డి నేతలు పనిచేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో చాలామంది రెడ్డి నేతలు పికప్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సారి మాత్రం కొందరు రెడ్డి నేతలు మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నారు. అలా సక్సెస్ కోసం పరితపిస్తున్న వారిలో సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఈయన సర్వేపల్లి నుంచి గత నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చారు. కానీ ఈ సారి మాత్రం చివరి ఛాన్స్ అని బరిలో దిగనున్నారు. సోమిరెడ్డికి ఈ సారి లక్ కుదిరేలా ఉంది.

అటు పలమనేరులో మాజీ అమర్నాథ్ రెడ్డి సక్సెస్ దిశగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఫెయిల్ అయిన సరే ఈ సారి మాత్రం విజయం సాధించాలని పనిచేస్తున్నారు. అలాగే పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఈ సారి అదృష్టం కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే ఆయన చాలావరకు పికప్ అయ్యారు. కాబట్టి పీలేరులో నల్లారికి గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

ఇక తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం గెలవడం సులువు అని చెప్పొచ్చు. అలాగే పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డికి కూడా అనుకూల పరిస్తితులు ఉన్నాయి. బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మలకు కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: