ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బయో వెపన్స్ ఉపయోగిస్తున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. శత్రు సైన్యాలను నాశనం చేయడానికి ఉపయోగించే అతి కిరాతక ఆయుధాలు ఈ బయోవెపన్స్.. వీటి వల్ల నీరు,ఆహారం, గాలి కలుషితమై వాతావరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా ఇలాంటి బయోవెపన్స్ వాడుతోందని అమెరికా సహా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రష్యా మాత్రం అమెరికానే ఉక్రెయిన్‌ తరపున ఇలాంటి బయోవెప్స్ వాడుతోందని ఆరోపిస్తోంది.


ఇప్పుడు ఈ అంశం ఐక్య రాజ్య సమితిలో చర్చకు దారి తీసింది. ఉక్రెయిన్‌లోఅమెరికా జీవాయుధ కార్యకలాపాలు చేపడుతోందన్న రష్యా ఆరోపణలను అమెరికా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ రష్యా దీర్ఘకాలంగా జీవాయుధాల కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని న పశ్చిమదేశాలు వాదిస్తున్నాయి. రసాయన ఆయుధాలను ఉపయోగించిన చరిత్ర ఉక్రెయిన్‌ది కాదని గుర్తు చేస్తున్నాయి. రష్యా తప్పుడు సమాచారాన్ని  వ్యాప్తి చేస్తోందని.. ఉక్రెయిన్‌పై తమదాడిని సమర్థించుకోవడానికి భద్రతామండలిని ఉపయోగించుకుంటోందని ఆరోపించాయి.


ఈ చర్చలో పాల్గొన్న ఇండియా మాత్రం జీవాయుధాలను నిషేధించాలని మరోసారి డిమాండ్‌ చేసింది. బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ క‌న్వెన్షన్‌ బీటీడబ్ల్యూసీని పూర్తి స్ఫూర్తితో........, సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమని భారత్ వాదించింది. ఈ చర్చలు ఎన్ని సాగుతున్నా ఉక్రెయిన్‌పై దాడుల్ని మాత్రం రష్యా మరింత ఉద్ధృతం చేసింది. కీవ్‌, లివీవ్‌ సహా మరికొన్ని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు, షెల్లింగ్‌లతో విరుచుకుపడింది. పుతిన్‌ సేనలు నివాసాలు, ఆస్పత్రులు, పాఠశాలలతో పాటుగాబాధితులు తలదాచుకుంటున్న శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపిస్తున్నాయి.


దొనెట్స్క్‌ వేర్పాటువాద బలగాలతో కలిసి రష్యా బలగాలు మరియుపోల్‌లో భీకర పోరాటం చేస్తున్నాయి. రష్యా దాడులతో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. క్రామటోర్స్క్‌లోని ఓ నివాస సముదాయంతో పాటు పాలనా భవనంపైనా పుతిన్‌ సేనలు బాంబులు కురిపించాయి. మరోవైపు మరియుపోల్‌ థియేటర్‌పై జరిగిన బాంబు దాడిలో ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: