తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ నేతృత్వం లోని తెరాస అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న ఓవరాల్ గా ప్రజల వైపు నుండి మద్దతు అయితే ఉందని చెప్పాలి. కానీ ఈ సారి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం లోకి వస్తామని తెరాస శ్రేణులు డబ్బా కొట్టుకుంటుంటున్నాయి. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు అలా లేవు. అయితే తెరాస కు ప్రత్యమ్నాయంగా మా పార్టీ ఉందని బీజేపీ పదే పదే
తమ వాణిని గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి గట్టిగానే కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా కొద్ది రోజుల ముందు ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం వరకు ఈ యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే ఇంతలోనే బీజేపీకి ఊహించిన చేదు వార్త వైరల్ గా మారింది. బండి సంజయ్ స్టార్ట్ చేసిన యాత్ర ఆగిపాయిందటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే బండి సంజయ్ పార్టీ శ్రేయస్సు కోసం భయకరమైన ఎండ అయినా కూడా లెక్క చేయకుండా ప్రజలకోసం యాత్ర కొనసాగించారు. అయితే ఎండ దెబ్బకు గురి అయిన బండి సంజయ్ రెండు రోజుల పాటు ఈ యాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈ వార్తల గురించి తెలుసుకున్న తెలంగాణ బీజేపీ... ఈ వార్తలను కొట్టి పారేసింది. ప్రచారం అవుతున్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదు అని, యధావిధిగా యాత్ర రేపటి నుండి ముక్తల్ నుండి స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ముక్తాల్ లో ఉన్న బండి సంజయ్ ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి విశ్రాంతి తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: