ఒక పక్క వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అల్లాడిపోతుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ గొడవలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఒక అధికార పార్టీ నేతను ప్రత్యర్ధులు అతి దారుణంగా హత్య చేసారు. కృష్ణా నదికి సమీపంలో ఉన్న వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో మాజీ సర్పంచి గన్నెబోయిన గంగరాజును, మంగళవారం రాత్రి మారణాయుధాలతో దాడి చేసి చెంపేసారు. దాంతో ఆ ఊరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంగరాజు బంధువులు ప్రత్యర్థుల ఇళ్ల పై దాడులు చేసారు. ఇళ్లను, వాహనాలను తగలబెట్టి, అల్లకల్లోలం చేసారు.

 

 

కొంతకాలంగా గంగరాజుకు, తన గ్రామంలో ఉండే ప్రత్యర్థి వర్గానికి చెందినవారితో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజులకు అవి బాగా ముదిరి, ఇంతటి దారుణానికి దారి తీశాయి. పాత కక్షల కారణంగా ఒక నిండు ప్రాణం బలయ్యింది. ఈ హత్య జరిగిన తర్వాత ప్రత్యర్థులు కుటుంబ సభ్యులతో సహా గూడెం వదిలివెళ్లిపోయారు. మంగళవారం అర్ధరాత్రి గంగరాజు బంధువర్గమంతా గొట్టిపాళ్ల నుంచి భారీగా కేపీగూడెంకు చేరుకుని ప్రత్యర్థుల గృహాలకు, వాహనాలకు నిప్పటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్రామంలోని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరుకు నిందితులపై కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు, నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏఎస్పీ చక్రధర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అసలు ఎన్నికల పోరు కోసం ఈ గొడవ మొదలయిందని గ్రామస్థులు చెప్తున్నారు. ఇళ్లనుంచి ఎవరినీ బయటకు రానీయకుండా పోలీసులు 144 section విధించారు. మామూలుగానే ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది. నిత్యావసర వస్తువుల కోసం ప్రతీ ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ గూడెంలో ఈ 144 సెక్షన్ కారణంగా ఒక్కరు కూడా బయటకు రాలేని పరిస్థితి.  అలా కొన్ని రోజులు నిర్బంధిస్తే కానీ పరిస్థితి సద్దుమణుగుతుందని పోలీసు వారు అభిప్రాయపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: