రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం పవన్‌ కల్యాణే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడ్డారు. ఇకపోతే రానున్న రోజుల్లో తిరుపతి ఎన్నికలు జరుగుతున్నాయి.తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు..


చంకలు గుద్దుకుని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట..’ అంటూ విజయసాయిరెడ్డి విరుచుకు పడ్డారు.. ఎన్నికలు వస్తున్నాయి అంటే జనాల్లో వెళ్ళడం.. సినిమా డైలాగులు చెప్పడం చేస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు. ఏదైనా చేయాలి లేకుంటే సీఎం కాదు.. టికెట్ కలెక్టర్ కూడా కాలేరు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు వినడానికి బాగుంటాయి.. కానీ చేయడానికి మాత్రం సరికావు అని అంటున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే అన్నీ తెలుసుకొని ఉండాలి.. అప్పుడే ప్రజలు నమ్ముతారు అని హితవు పలికారు..


విజయ్ మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్లు బాకీపడి లండన్ పారి పోయాడు. ట్రాన్స్ ట్రాయ్ పేరు తో 10 వేల కోట్లు బ్యాంకుల లూటీకి పాల్పడిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి మాత్రం దొరలా తిరుగుతున్నాడు. బ్యాంకుల నుంచి లూటీ చేసిన మొత్తంలో సగం చంద్రబాబే నొక్కేశాడు. దర్యాప్తులో జాతకాలు అన్నీ బయటికొస్తాయి’ అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.. ఉప ఎన్నికల కోసం రాజకీయ నేతలు కూడా ప్రచారంలో జోరును పెంచారు. గత ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న బీజేపి, జనసేన లు ఇప్పుడు ప్రచారంలో దూకుడును కొనసాగిస్తున్నారు. విజయం ఏ పార్టీకి అనుకూలంగా వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: