తిరుపతి ఉప ఎన్నికలు నిన్న జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో తలేత్తనీ ఉద్రిక్తతలు ఈ ఎన్నికల్లో వెలుగు చూశాయి. దొంగ ఓట్లను వేయించడానికి రాజకీయ నాయకులు వెనకాడలేదు.వైకాపా భారీగా దొంగ ఓట్లు వేయించింది. ఇందులోభాగంగా ఇతర ప్రాంతాల నుంచి వందల బస్సుల్లో మనుషులను, డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి తరలించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. 'తిరుపతి శాసనసభ స్థానం పరిధిలో ఎన్నికను పూర్తిగా రద్దు చేసి... కేంద్ర బలగాలు, అధికారుల పర్యవేక్షణలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలంటూ బాబు డిమాండ్ చేశారు.


మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది..ఇతర అవకతవకలు చోటు చేసుకున్న చోట్ల రీ పోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్‌లో విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు, ఆ పార్టీ పార్లమెంటరీ నేతలు, ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ ఫిర్యాదు చేశారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ... 'మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు ఇతర ప్రాంతాల నుంచి వేల మందిని తీసుకొచ్చి బస ఏర్పాటు చేసి, వారితో అధికార వైకాపా దొంగ ఓట్లు వేయించింది. పోలీసులు వారందరికీ కాపలాగా ఉన్నారు..' అని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు బందిపోట్లను మరిపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.


ఇకపోతే..ప్రజల్లో వైసీపీకి మంచి గుర్తింపు లేదు.. దీంతో ఓటమి భయం పట్టుకుంది.. అందుకే దొంగ ఓట్లకు తెర తీశారు.తిరుపతిలో జరిగిన అక్రమాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. వైకాపా నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అతీతులా? ఈ ఎన్నికల్లో బరితెగించిన వారందరిపై ఈసీ వేటు వేయాలి. పోలింగ్‌ అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగులతో సహా ఎన్నికల అధికారులకు అందించాం. ఈసీ కూడా వారి పరిశీలకుల ద్వారా అన్ని వివరాలు తెప్పించుకోవాలి. మా వాళ్లు డైరీ సరిగ్గా రాయలేదు... అని తర్వాత చెప్పొద్దు. మీ వాళ్లు సరిగ్గా నివేదిక ఇవ్వలేదంటే వాళ్లూ రాజీ పడ్డారనే అర్థం...'' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయం ఇంకెంత వరకు వెళుతుందో మే 2 న వెలువడే ఫలితాలే చెబుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: