తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లో సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నామని అన్నారు. కరోనా కారణంగా ఖర్చు పెరిగి ఆదాయం తగినా క్లిష్ట పరిస్థితుల్లో సైతం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని అన్నారు. 


గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఈ యాసంగి లో భూమికి బరువు పెరిగి ఎంత ఒడ్లు దిగుబడి వచ్చిందని ఆయన అన్నారు. యాసంగి లో తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. గజ్వేల్ లో 60 ఎకరాలలో ఎండిపోయిన పంటను కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2014 కంటే ముందు , తర్వాత తెలంగాణ పరిస్థితుల ను ప్రజలను అర్థం చేసుకోవాలని అన్నారు. అంతే కాక అన్నం పెట్టిన పాలకులను, ప్రభుత్వాలను మరువొద్దన్న మంత్రి దేశానికీ అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ ఎదిగిందని అన్నారు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ది జరిగింది ఒక్క తెలంగాణలోనే అని ఆయన అన్నారు. ఇక లబ్దిపొందిన వాళ్ళే ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. సూర్యుడి పై ఉమ్మి నట్టే ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో కేసిఆర్ పుట్టడమే మన అదృష్టం అని ప్రజలంతా కేసిఆర్ వెంటే ఉంటారని ఆయన కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: