ఏపీలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు....అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. టి‌డి‌పి నేత పట్టాభి..సి‌ఎం జగన్‌ని పరుష పదజాలంతో దూషించారని చెప్పి, వైసీపీ శ్రేణులు...రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టి‌డి‌పి ఆఫీసులపై, పట్టాభి ఇంటిపై దాడి చేశారు. ఇక వైసీపీ నేతలు...చంద్రబాబుని బూతులతో ఎలా దూషించారో కూడా అందరికీ తెలిసిందే. కానీ తమ నేతలు ఎప్పుడు బూతులు మాట్లాడనట్లు సి‌ఎం జగన్‌ చెప్పుకొచ్చి, తమ అభిమానులకు బీపీ వచ్చి టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేశారని చెప్పే పరిస్తితి వచ్చింది. అంటే రాష్ట్రంలో రాజకీయం ఎలా తయారైందో క్లియర్ గా అర్ధమైపోతుంది.

అయితే వైసీపీ చర్యలకు టి‌డి‌పి కూడా గట్టిగానే స్పందిస్తుంది. రాష్ట్రంలో టి‌డి‌పి శ్రేణులు ఫుల్ గా యాక్టివ్ అయ్యాయి. దాడులకు నిరసనగా బంద్ కూడా చేశారు. ఇక చంద్రబాబు...దీక్షకు దిగుతున్నారు. అటు టి‌డి‌పి ఆఫీసులపై దాడులని ఇతర పార్టీల నేతలు కూడా ఖండించారు. పవన్ కల్యాణ్ సైతం దీనిపై స్పందించి...ఖండించారు. కానీ సొంత పార్టీ నేతలు కొందరు మాత్రం అసలు బయటకు రాలేదు. కనీసం వైసీపీ దాడులని ఖండిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టలేదు. అలా ఏ మాత్రం రెస్పాన్స్ ఇవ్వని వారిలో టి‌డి‌పి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌లు ఉన్నారు. మరొక ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్టీ కోసం ఎప్పుడు అండగానే నిలబడుతున్నారు. కానీ కేశినేని, గల్లాలు ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.

ఇంత జరుగుతున్నా ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఉంది. సరే ఎక్కడ ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా దాడి ఘటనలని ఖండించాలసిన బాధ్యత ఎంపీలపై ఉంది. కానీ వారు ఏ మాత్రం స్పందించలేదు. మరి ఇంత జరిగినా స్పందించకపోవడం వెనుక కారణం ఏముందో తెలియకుండా ఉంది. ఇప్పటికే కేశినేని, గల్లాలు పార్టీ మారిపోవచ్చని వార్తలు వస్తున్నాయి. మరి ఆ దిశగానే గల్లా, కేశినేనిలు వెళుతున్నారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: