పొత్తుల వల్ల మేలు జరుగుతుందని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారమే చేతులు కలిపినప్పటికీ రోజు రోజుకి ఈ పొత్తుల వల్ల దాడులు మాత్రం ఎక్కువవుతున్నాయి.. గత కొన్నేలుగా పార్టీ కోసం పనిచేసిన తమకు కాదని వేరే అభ్యర్థులకు టికెట్ ఎలా ఇస్తారంటూ అటు టిడిపి జనసేన లో చాలా అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి.. ముఖ్యంగా పిఠాపురం విషయానికి వస్తే పోత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ను ఇక్కడి నుంచే బరిలోకి దింపబోతున్నారు. ఈ విషయం ప్రకటించిన వెంటనే అక్కడ స్థానిక టిడిపి నేత వర్మ అధిష్టానం పైన చాలా ఫైర్ అయ్యారు.


దీంతో వర్మ అనుచరులు రోడ్డుపైకి వచ్చి తీవ్రమైన నిరసనను కూడా తెలియజేస్తున్నారు. టిడిపికి వర్మను మోసం చేసిందని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దాడులు కూడా చేపట్టారు.. అటు టిడిపి జెండాలు ఫ్లెక్సీలు కూడా తగలబెట్టడమే కాకుండా పవన్ చంద్రబాబులకు వ్యతిరేకంగా పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు.. వర్మ కు టికెట్ ఇవ్వాలని లేకపోతే టిడిపి తీవ్ర పరిణామాలు చూస్తుందంటూ అనుచరులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు.


ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించడంతో పవన్ కు మద్దతు తెలిపేందుకు వర్మ ఒప్పుకున్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పనిచేస్తానని ప్రకటించినప్పటికీ స్థానికంగా ఇరువురు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు.. స్థానిక నేత వర్మను కాదని పిఠాపురం నుంచి జనసేనకు సీటు కేటాయించడంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది టిడిపి శ్రేణులు పవన్ కి మద్దతు ఇచ్చేదే లేదనే విధంగా మాట్లాడుతున్నారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక జనసేన కేడర్ టిడిపి క్యాడర్ పైన దాడికి దిగుతున్నట్లు వర్మ ఆవేదనను తెలియజేస్తున్నారు..పవన్ పల్లకిని మోస్తున్న మాత్రాన ఇలా దాడులు చేస్తే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోమని తెలియజేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ నూ ఓడించిన ఆశ్చర్య పోవడం ఏమీ లేదని తెలుస్తది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కొత్త పెట్టుకొని చాలా తప్పు చేశారంటూ పలువురు జనసేన నేతలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: