తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని అనుకున్నారు అందరు. ఒకటి కాదు రెండు కాదు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు చాలామంది. కానీ ఊహించని రీతిలో హ్యాట్రిక్ కొడుతామని గట్టిగా నమ్మిన టిఆర్ఎస్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఏకంగా గులాబీ అధినేత కేసిఆర్ పాలన నచ్చకనో లేదంటే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆలోచనో తెలియదు కానీ ఇక బీఆర్ఎస్ ను తెలంగాణ ఓటర్లు అందరూ కూడా ఓడించి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు.


 ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని  కలలో కూడా ఊహించని బిఆర్ఎస్ కీలక నేతలకు అందరికీ కూడా పార్టీ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదాం అంటూ పార్టీ నేతలు అందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు గులాబీ దళపతి కెసిఆర్. ఇలాంటి సమయంలో పార్టీ నేతల వ్యవహారం మాత్రం కేసిఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసీ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తారు అనుకుంటే.  ఏకంగా పార్టీలోనే నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్.


 ఇప్పటికే ఎంతోమంది టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇదంతా చాలదు అన్నట్టు ఇటీవల ఒక సమావేశంలో మరోసారి బారాస నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పార్టీ నాయకులతో కేటీఆర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిల మధ్య మైక్ విషయంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న తలసాని సర్ది చెప్పడంతో ఇక వివాదం సద్దు మనిగింది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటూ ఉంటుండగా.. ఇక ఇప్పుడు ఇలా మరి కొంతమంది పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడుతూ ఉన్నాయ్. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెద్దాయన పావులు కదుపుతుంటే.. పార్టీ నాయకుల తీరు మాత్రం  కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: