లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తమ పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లను ఎంచుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నుండి సీటు దక్కిన వారు సంబరాలను జరుపుకుంటూ ఉంటే దక్కని వారు తీవ్ర నిరుత్సాహంతో ఉంటున్నారు. ఇక సీటు దక్కని వారిలో కొంతమంది పార్టీపై నిరసన సెగలను రేపుతున్నారు. ఇప్పటికే దేశంలో అధికారంలో ఉన్న బీజీపీ పార్టీ మరోసారి కూడా అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

అందులో భాగంగా క్యాండిట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ హై కమాండ్ 7 లిస్టులను విడుదల చేసింది. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో క్యాండేట్ లను సెలెక్ట్ చేయలేదు. ఇకపోతే ఇంతవరకు ఎదురుచూసిన ఓ నేతకు సీటు రాకపోవడంతో తన మద్దతుదారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

బీవీ నాయక్‌ అనే వ్యక్తికి బీజీపీ అధిష్టానం టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన అభిమానులు , కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. దానితో ఈయన మద్దతుదారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బీజీపీ అధిష్టానం తాజాగా ఈయనకు టికెట్ ను నిరాకరించడంతో ఆయన అభిమానులు , మద్దతుదారులు బుధవారం రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకుమార్‌, శివమూర్తి అనే ఇద్దరు బీవీ నాయక్‌ మద్దతుదారులు నిరసన తెలుపుతూ.. పొట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో మరో మద్దతుదారుడు వెంటనే వారి వద్ద నుంచి పేట్రోల్‌ క్యాన్‌ను లాక్కున్నాడు.


అక్కడితో ఆగకుండా బీవీ నాయక్‌ అభిమానులు టైర్లతో మెయిన్‌రోడ్డును దిగ్బంధం చేశారు. ఇకపోతే బీవీ నాయక్‌ 2019 వ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఈయన సమీప బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర నాయక్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో ఈయన దాదాపు లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి చేరిన ఈయన మొదటి నుండి రాయ్‌చూర్‌ ఎంపీ సీట్ ను ఆశిస్తూ వచ్చాడు. కాగా తాజాగా ఈ స్థానాన్ని బీజీపీ పార్టీ సెట్టింగ్ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌కు కేటాయించింది. దీనితో బీవీ నాయక్‌ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp