నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పొలిటికల్ కెరీర్ ఖతం అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.ఎందుకంటే ఆయనకు తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు. దానికంటే ముందు ఎంపీ జాబితాలో కూడా ఆయన పేరు లేదు.వాస్తవానికి సోము వీర్రాజు ఈసారి రాజమండ్రి నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఎంపీ సీటు  పురంధేశ్వరికి వెళ్ళింది. రాజమండ్రి అర్బన్ రూరల్ లలో ఏదో ఒక అసెంబ్లీ సీటయినా దక్కుతుందంటే అది కూడా టీడీపీ తీసుకుంది. దాంతో సోము వీర్రాజుకు ఇపుడు రాజకీయంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తుంది.సోము వీర్రాజు 1980 వ సంవత్సరంలో బీజేపీ యువ మోర్చా తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆయన అలా బీజేపీలో చాలా పదవులు అందుకున్నారు. అయితే ఇంతటి సీనియర్ నేత కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతలకు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజుకు ఈసారి పోటీ చేయకపోవడానికి ఛాన్స్ రాకపోవడం పట్ల చర్చ నడుస్తుంది.ఇక ఇదిలా ఉంటే బీజేపీలో వలస నాయకులకే టికెట్లు దక్కాయని అంటున్నారు.


ఇంకా దాంతో పాటుగా ఫస్ట్ నుంచి ఉన్న వారిని వెనక్కి నెట్టేశారని అంటున్నారు. సుజనా చౌదరి వంటి వారికి టికెట్లనేవి దక్కాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ సీటుని  రమేష్ కి ఇచ్చారు.పార్టీలో తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సుముఖంగా ఉన్న వారికి టికెట్లు దక్కాయని అదే విధంగా ఏపీ బీజేపీ సొంతంగా ఎదగాలని కోరుకునే వారిని పక్కన పెట్టారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ అగ్ర నాయకులకు కొంతమంది సీనియర్లు లేఖ రూపంలో రాయడం జరిగింది. అది జరిగిన తరువాత సీనియర్లకు పూర్తిగా టికెట్లు ఇవ్వలేదంటే హై కమాండ్ ఆలోచనలు ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు.హై కమాండ్ కనుక తలచుకుంటే ఇప్పటికీ సోము వీర్రాజుకు పోటీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. అలాగే ఆయన విషయంలో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. కాకినాడ ఎంపీ సీటు నుంచి ఆయనను పోటీ చేయిస్తారని తెలుస్తుంది. అయితే ఇది  సాధ్యమో కాదో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: