సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో అయినా ఇన్ని ట్విస్టులు ఉంటాయో ఉండవో కానీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అన్ని ట్విస్ట్ లు తెరమీదికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారు అన్నది ఊహించిన విధంగా మారిపోయింది  అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి కారెక్కిన నేతలు అందరూ కూడా ఇక ఇప్పుడు నిర్మొహమాటంగా కారు దిగిపోతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చేతి గుర్తు పార్టీతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు.


 దీంతో గులాబీ దళపతి కేసీఆర్ కి ఊహించని షాక్ లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో నమ్మకస్తులు అనుకున్న నాయకులే.. గులాబీ కండువా కి రాం రాం చంపేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో చేరి దాదాపు 10 ఏళ్ల పాటు కారులోనే తిరిగిన ఒక సీనియర్ నేత ఇక ఇప్పుడు మళ్లీ తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ లోనే చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్యసభ ఎంపీ కేకే ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇదే విషయం కెసిఆర్ కు చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లారట కేకే.


 గులాబీ బాస్ కి ముందే కోపం ఎక్కువ.. పార్టీ మారుతున్నాను అని చెబితే.. ఊరుకుంటారా.. ఇక ఇదే విషయం చెప్పడానికి వెళ్ళిన కేకే ని తిట్టి పంపించారట  పెద్దాయన. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది  పార్టీ మారుతున్నట్లు కేసిఆర్ కు కేకే చెప్పగానే.. పెద్దాయన తిట్ల దండకం అందుకున్నారట. పదేళ్లపాటు పార్టీలో చేర్చుకొని పెద్దపీట వేసి పదవులు ఇస్తే.. కష్ట కాలంలో వదిలేసి వెళ్ళిపోతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ మారేందుకు ఇంకా సాకులు ఎందుకు చెబుతున్నావు అని మండిపడ్డారట  దీంతో కేసీఆర్ తో మాటలు పడలేక కేకే మధ్యలోనే వచ్చేసారట. అయితే కేకే ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతుండగా కేకే కుమారుడు మాత్రం టిఆర్ఎస్ లోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం.


 ఇలా కేసీఆర్ ను కలవడానికి వెళ్ళిన కేకేని.  ఆయన తిట్టారు అన్న విషయం తెలిసి.. గులాబీ బాస్ తీరును తప్పుపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ ఉండగా.. పార్టీ మారుతున్నట్లు చెప్పడానికి వచ్చిన కేకేను తన కేసీఆర్ మాస్టర్ మైండ్ తో బుజ్జగించి సర్ది చెప్పాలి కానీ.. ఇలా తిడితే పార్టీలో ఇంకెవరు ఉంటారు అన్నది రాజకీయ విశ్లేషకులు భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: