తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందుకంటే ఎన్నికల తర్వాతే రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మార్పులు జరుగుతున్నాయి . ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీకి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సహా పలువురు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి... కూతురు కావ్యతో కలిసి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూ ఆమె పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక నేడు ఢిల్లీలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో ఉద్యమ నాయకుడు.. బీఆర్ఎస్ యువ నేత ఆరూరి రమేష్ ను బరిలో దింపాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఆరూరి రమేష్ కు నియోజకవర్గంలో క్రేజ్ ఉండడం... పార్టీ కోసం కష్టపడటంతో అతడే కరెక్ట్ అని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుండి కావ్య లేదా కడియం పోటీ చేసినా ఆరూరి రమేష్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇక మొదట అధిష్టానం కూడా ఆరూరి పేరునే పరిశీలించినట్లు తెలుస్తోంది.

కానీ కడియం కోసమే టికెట్ ను కావ్యకు ఇచ్చినట్టు సమాచారం. మరి ఇప్పుడు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇలా ఉంటే వరంగల్ ఎంపీ టికెట్ కావ్యకు ఇస్తారా.... లేదంటే కడియం శ్రీహరికి ఇస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నేడు వీరు కాంగ్రెస్ లో చేరిన అనంతరం టికెట్ ఎవరికి ఇస్తారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: