పార్లమెంటు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అవే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు. అక్కడ బరిలోకి దిగిన అభ్యర్థులు ఎవరు? ఇక ఎవరి బలాబలాలు ఏంటి? గెలవబోయేది ఎవరు అన్న విషయం ఎప్పుడు ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది ఇలాగే హాట్ టాపిక్ ఆ మారింది.


 అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇక ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోని నియోజకవర్గాలలో పార్టీకి క్యాడర్ ఎలా ఉంది అన్నది ఎంతో ముఖ్యం. ఇక ఆ లోక్ సభ సెగ్మెంట్లో ఉండే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఎవరు ఉన్నారు అన్న విషయం కూడా లోక్ సభ అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తూ ఉంటుంది. లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉంటే.. విజయం సాధించవచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు . కానీ బిఆర్ఎస్ పార్టీ విషయంలో మాత్రం ఇది మరోలా ఉంది.


 ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, ఇక కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఆరింటిలో బిఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ మిత్ర పక్షం అయినా ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఉన్నదంతా బిఆర్ఎసోల్లే. మరి ఇక్కడ గెలిచేది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 ప్రస్తుతం సామాజిక సమీకరణాలు చూసుకుంటే.. మరోసారి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా  ఎందుకంటే  కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ అంత బలమైన ప్రత్యర్థి కాదని.. అదే సమయంలో ఇక బిఆర్ఎస్ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని.  పద్మారావు గౌడ్ సరైన అభ్యర్థి కాదు అనే చర్చ కూడా నడుస్తుంది. దీంతో ఇలా ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పట్టు ఉన్న గెలిచేది మాత్రం మళ్లీ కిషన్ రెడ్డి అని విశ్లేషకుల అంచనా. అయితే 2019లో కూడా ఇదే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr