రోజా.. అన‌గానే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది గులాబీ పువ్వు. ఈ పువ్వు అల్లంత దూరాన ఉండ‌గానే సువాస‌న లు గుబాళిస్తుంది. అంద‌రికీ నేత్రానందం కూడా క‌లిగిస్తుంది. ఇలానే రాజ‌కీయ రోజా కూడా ఇప్ప‌టికి ప‌దేళ్లుగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గుబాళిస్తూనే ఉన్నారు. క‌ష్ట‌మో.. ఇష్టమో.. ఇక్కడి ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు వ‌రుస‌గా ప‌ట్టం క‌డుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ముచ్చ‌ట‌గా మూడోసారి విజ‌యం ద‌క్కించుకుందామ‌ని భావిస్తున్న రోజా.. హైబ్రిడ్ రోజాగా మారార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ వినిపిస్తోంది.

దీనిలో ఆశ్చ‌ర్యం ఏమీ లేదని కూడా అంటున్నారు. అటు హైద‌రాబాద్‌, ఇటు న‌గ‌రి.. మ‌రోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంపై ఆమె దృష్టి పెట్ట‌లేక పోయారు. ఇప్పుడు దూర‌మైన ఇద్దరు త‌మ్ముళ్లు కూడా గ‌త మూడేళ్ల‌లో చేయాల్సింది చేసేశారు. కౌన్సిల‌ర్ భువ‌నేశ్వ‌రిని మోసం చేశార‌న్న ఆగ్ర‌హం నియోజ‌క‌వ‌ర్గంలోని బీసీల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, న‌గ‌రి నుంచి ఇసుక‌ను త‌మిళ‌నాడుకు అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎక్క‌డ విన్నా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇది రోజాకు మైన‌స్ కాగా.. మ‌రోవైపు.. రెండుసార్లు అవ‌కాశం ఇచ్చాం.. ఇప్పుడుగాలి కుటుంబానికి ఛాన్స్ ఇవ్వాల్సిందే.. అని కుల సంఘాలు చేస్తున్న తీర్మానాలు కూడా రోజా గుబాళింపుల‌కు చెక్ పెడుతున్నా యి. పైకి రోజా చాలా గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆమె కుమ్ములాట‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌నేది వాస్త‌వం. మ‌రోవైపు ఏ స‌ర్వే చూసినా.. రోజాకు అవ‌కాశం లేద‌నే చెబుతోంది. పైగా గాలి భాను వైపు ఉంద‌ని వ్యాఖ్యానిస్తుండ‌డం కూడా నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌భావం చూపుతోంది.

ఇదంతా గ‌మ‌నిస్తున్న సామాన్యులు కూడా.. గెలిచే వ్య‌క్తి వైపు నిల‌బ‌డితే పోలా అనే డైలాగులనే పేలుస్తు న్నారు. దీంతో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా ప‌రిస్థితి గుబాళింపులు లేని హైబ్రిడ్ రోజాగా మారిపోయింది. సొంత పార్టీ నాయ‌కులు కూడా కూట‌ములు క‌ట్టి ఓడించేందుకు రెడీ కావ‌డం.. అన్న‌ద‌మ్ములు అంద‌రూ దూరం కావ‌డం.. వారు చేసిన త‌ప్పుడు ప‌నులు స‌రిదిద్దుకోలే స‌త‌మ‌తం అవుతుండ‌డం వంటివి రోజాకు త‌ల‌కు మించిన భారంగా మారింది. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు  ప‌ట్టుకున్న త‌మిళ‌నాడు బోర్డరు ప్రాంతాల్లో ప‌వ‌న్ అభిమానులు కూడా రోజాకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో రోజా.. ఈసారి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: