ఎస్ ఇప్పుడు ఇదే నూటికి నూరు శాతం నిజం అనుకోవాలి. పొత్తులో భాగంగా జ‌న‌సేన - తెలుగుదేశం కూట‌మి చాలా ఈజీగా గెలిచే రెండు లేదా మూడు సీట్ల‌ను చంద్ర‌బాబు త‌న చేత‌గాని త‌నంతో పాటు అతి తెలివి వ‌ల్ల ఈజీగా గెలిచే సీట్ల‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వచ్చేసింది. ఉత్త‌రాంధ్ర‌లో ఎచ్చెర్ల‌, నెల్లిమ‌ర్ల తో పాటు తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి సీటును కూడా కూట‌మి కోల్పోయే ప్ర‌మాదం వ‌చ్చేసింది. వాస్త‌వంగా ఈ మూడు సీట్లు సొంతంగా పోటీ చేస్తే తెలుగుదేశం ఈజీగా గెలిచేది.

2014లో జ‌న‌సేన స‌పోర్ట్ చేయ‌డంతో ఈ మూడు సీట్ల‌లో టీడీపీ ఈజీగా విన్ అయ్యింది. అయితే ఈ సారి చేసిన పొర‌పాటు తో పాటు పొత్తులో ఈ సీట్లు జ‌న‌సేన‌, బీజేపీకి ఇవ్వ‌డంతో మూడు సీట్ల‌లో పార్టీ ఘోరంగా ఓడిపోనుంద‌ని అంటున్నారు. ఎచ్చెర్ల సీటును క‌ళా వెంక‌ట్రావు తో పాటు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు ఆశించారు. అయితే ఈ సీటును నాన్ లోక‌ల్ కు అది కూడా బీజేపీకి ఇచ్చారు.

పైగా తూర్పు కాపులు ఎక్కువుగా ఉన్న సీటును క‌మ్మ నేత‌కు ఇవ్వ‌డం కూడా పార్టీకి పెద్ద దెబ్బ ప‌డిపోనుంది. ఈ సీటు బీజేపీకి ఇవ్వ‌డం.. పైగా క్యాస్ట్ ఈక్వేష‌న్ రెండు మైన‌స్ అయ్యి పార్టీ దెబ్బ‌తిన‌నుంది. ఇక నెల్లిమ‌ర్ల సీటును టీడీపీలో క‌ర్రోతు బంగార్రాజుకు ఇస్తే టీడీపీ ఈజీగా విన్ అయ్యేది. ఈ సీటును జ‌న‌సేన నుంచి లోకం మాధ‌వికి ఇచ్చారు. ఇది కూడా రాంగ్ స్టెప్పే.

ఇక అన‌ప‌ర్తి సీటును టీడీపీ తీసుకుని న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణా రెడ్డికి ఇస్తే ఈజీగా గెలిచేది. కానీ ఈ సీటును బీజేపీకి ఇవ్వ‌డంతో పాటు అస‌లు ఊరూ పేరు లేని వ్య‌క్తికి.. అందులోనూ ఇక్క‌డ రెడ్డి వ‌ర్గం ఆ త‌ర్వాత కాపు వ‌ర్గం బ‌లంగా ఉంటే క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి ఇవ్వ‌డంతో అన‌ప‌ర్తి సీటును కూడా చేజేతులా కోల్పోతున్న‌ట్టు అవుతోంది. ఏదేమైనా బాబు పొత్తులో భాగంగా వేసిన త‌ప్పులు పార్టీని నిలువునా ముంచేసేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: