ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పలు రకాల సర్వేలు సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు  సపోర్టుగా కొన్ని మీడియా సంస్థలు  సర్వేలు నిర్వహిస్తే ఈసారి అధికారంలోకి  వచ్చే పార్టీ ఇదే అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.. అయితే ఇప్పుడు తాజాగా మరొక ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఒక సంచలన సర్వేను విడుదల చేసింది. మరి ఆ సర్వే ప్రకారం ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందో చూద్దాం..


రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సిపి మరొకసారి ప్రభంజనం సృష్టిస్తుందని ప్రముఖ జాతీయ మీడియాలలో ఒకటైన టైమ్స్ నౌ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తెలియజేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రాలోని ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ సంస్థ నెలరోజులపాటు విస్తృతంగా సర్వే నిర్వహించి విడుదల చేసినట్లుగా తెలియజేశారు.. ఈ సర్వేన నిన్నటి రోజున రాత్రి టైమ్స్ నౌ చానల్లో ప్రసారం చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్సభ స్థానాలను వైసీపీ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తుంది..


టిడిపి,  బిజెపి, జనసేన కూటమి జతకట్టి వచ్చినప్పటికీ ఘోరపరాభావం తప్పదంటూ ఈ సర్వేలో తెలియజేశారు.. దేశంలోనే అతిపెద్ద నాలుగవ పార్టీగా వైఎస్సార్సీపి పార్టీ ఉండబోతోందని తెలిపారు.. ఇక బిజెపి పార్టీ 329-359 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ 27 నుంచి 47 సీట్లని.. డీఎంకే పార్టీ 24 నుంచి 28 సీట్లని.. వైసిపి పార్టీ 21 నుంచి 22 సీట్లు గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది..


అయితే ఇప్పుడు ఆంధ్రాలో తాజా రాజకీయ పరిణామాలు ఇలా ఉన్నాయంటూ టైమ్స్ నౌ వెల్లడించింది.. గత ఎన్నికలలో పోలిస్తే వైయస్సార్ పార్టీ ఈసారి మరింత తిరుగులేని శక్తిగా మారిందని.. గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు 99% నెరవేర్చడంతో సీఎం జగన్ పైన కూడా ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నారని.. అందుకే ప్రజలు కూడా సంక్షేమానికి జై కొడుతున్నారనే విధంగా పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.. అందుకు సంబంధించి ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే టైమ్స్ నౌ ప్రకారం ఈసారి కూడా గెలుపు అధికార పార్టీ వైఎస్ఆర్సిపీ దే అని స్పష్టమవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: